BCCI : సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా తయారీపై భారత క్రికెటర్ నియంత్రణ మండలి(BCCI) కసరత్తు చేస్తోంది. ఇప్పటికే మహిళా క్రికెటర్ల వార్షిక కాంటాక్టులో యువకెరటాలకు ప్రాధాన్యం ఇచ్చిన బీసీసీఐ.. పురుషుల విషయంలో అదే సూత్రాన్ని అనుసరించనుంది. గత సీజన్ నుంచి నిలకడగా రాణిస్తున్న ముగ్గురు కుర్రాళ్లకు వార్షిక కాంట్రాక్టు అప్పగించేందుకు సిద్ధమవుతోంది. వీళ్లలో ఇద్దరు ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 18వ సీజన్లో అదరగొడుతున్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో సూపర్ సెంచరీతో మెరిసిన తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి(Nitish Kumar Reddy) కూడా బీసీసీఐ పెద్దల దృష్టిలో ఉన్నాడని సమాచారం.
ఐపీఎల్ 18వ సీజన్లో రికార్డు స్కోర్ కొట్టిన సన్‌రైజర్స్ ఓపెనర్ అభిషేక్ శర్మ(Abhishek Sharma) సెంట్రల్ కాంట్రాక్ట్ రేసులో అందరికంటే ముందున్నాడు. ఉప్పల్ మైదానంలో సుడిగాలి ఇన్నింగ్స్ ఆడిన ఈ హిట్టర్ 141 పరుగులతో వారెవ్వా అనిపించాడు. అంతకుముందు టీ20ల్లో భారత జట్టు తరఫున కళ్లు చెదిరే బ్యాటింగ్ చేశాడీ ఓపెనర్. దాంతో, అభిషేక్‌కు గ్రేడ్ సీ కాంట్రాక్ట్ దక్కనుందని టాక్. అదే జరిగితే.. ఈ పంజాబీ కుర్రాడు ఏడాదికి రూ. 1 కోటి వేతనంగా అందుకోనున్నాడు.
🧡
Abhishek Sharma | #PlayWithFire | #SRHvPBKS | #TATAIPL2025 pic.twitter.com/OaD4YQEmTT
— SunRisers Hyderabad (@SunRisers) April 12, 2025
ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి సైతం సెంట్రల్ కాంట్రాక్ట్ రేసులో ఉన్నాడు. 18 సీజన్ ఐపీఎల్లో విఫలం అవుతున్న ఈ యంగ్‌స్టర్.. ఆస్ట్రేలియా గడ్డపై ఖతర్నాక్ ఇన్నింగ్స్‌లు ఆడాడు. 21 ఏళ్ల నితీశ్ మెల్బోర్న్లో అద్భుత శతకంతో రికార్డులు నెలకొల్పాడు. అంతేకాదు.. ఐదు టెస్టులు, 4 టీ20లు ఆడిన నితీశ్ గ్రేడ్ ‘సీ’
కాంట్రాక్ట్‌కు కచ్చితంగా ఎంపికయ్యే అవకాశముంది.
Congratulations to Nitish kumar reddy on scoring his first century. This remarkable achievement reflects hard work and dedication. We look forward to witnessing more successes in your career. Keep inspiring us all. pic.twitter.com/fjhe7iN8T9
— 𝕸𝖔𝖍𝖆𝖒𝖒𝖆𝖉 𝖘𝖍𝖆𝖒𝖎 (@MdShami11) December 28, 2024
పేస్ బౌలింగ్‌లో రాటుదేలుతూ.. వికెట్ల వేట కొనసాగిస్తున్నాడు హర్షిత్ రానా(Harshit Rana). ఐపీఎల్లో కోల్‌కతా నైట్ రైడర్స్(KKR)కు ఆడుతున్న ఈ సీజన్లో నిప్పులు చెరుగుతున్నాడు. 7 మ్యాచుల్లో 10 వికెట్లు పడగొట్టాడు ఈ పేస్ గన్. ఇప్పటివరకూ టీమిండియా ప్లేయర్‌గా రానా 2 టెస్టులు, 5 వన్డేలు, ఒక టీ20 ఆడాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో చెలరేగి ఆడిన శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) మళ్లీ సెంట్రల్ కాంట్రాక్టు దక్కించుకోనన్నాడు. ఇక మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చ క్రవర్తి కూడా కాంట్రాక్ట్ జాబితాలో ఉండనున్నాడు.
Abhishek Sharma, Nitish Kumar Reddy and Harshit Rana are likely to be included in Grade C of BCCI central contracts, with an annual salary of INR 1 crore.#AbhishekSharma #NitishKumarReddy #HarshitRana #BCCI #CricketTwitter pic.twitter.com/KLcH35TlaX
— InsideSport (@InsideSportIND) April 17, 2025
బీసీసీఐ నియమాల ప్రకారం.. సెంట్రల్ కాంట్రాక్ట్‌కు అర్హత సాధించాలంటే కనీసం మూడు టెస్టులు ఆడాలి. లేదంటే 8 వన్డేలు.. అదీ కాదంటే 10 టీ20లు అయినా ఆడాలి. ఈ మూడింటిలో ఏ ఒక్క ఫార్మాట్లో అయినా వాళ్లు తగినన్ని మ్యాచ్‌లు ఆడిన వాళ్ల పేర్లను సెంట్రల్ కాంట్రాక్ట్ కోసం బీసీసీఐ పరిశీలిస్తుంది. మరో రెండు మూడు రోజుల్లో వార్షిక కాంట్రాక్ట్ జాబితా విడుదలయ్యే అవకాశముంది.