IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో బ్యాటర్లు విధ్వంసక ఇన్నింగ్స్‌లతో చెలరేగుతున్నారు. మరోవైపు స్టార్ బౌలర్లు కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ జట్టు విజయంలో భాగమవుతున్నారు. ఈ క్రమంలోనే కొందరు రికార్డులు సృష్టిస్తున్నారు. ఇదిలా ఉంటే.. సీనియర్ పేసర్ సందీప్ శర్మ(Sandeep Sharma) చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. సుదీర్ఘ ఓవర్ వేసిన నాలుగో బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు.
రాజస్థాన్ రాయల్స్ పేసర్ సందీప్ బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals)తో జరిగిన మ్యాచ్‌లో 11 బంతులు వేశాడు. అందులో నాలుగు వైడ్స్ కాగా.. ఒకటి నో బాల్ ఉన్నాయి. తద్వారా ఐపీఎల్ చరిత్రలో 11 బంతులేసిన బౌలర్ల జాబితాలో చేరిపోయాడు.
Four wides, one no-ball, one four, one six!
Quite a long last over from Sandeep Sharma!!
📸: JioHotstar#SandeepSharma #TristanStubbs #AshutoshSharma #DCvsRR #DCvRR #IPL2025 #IPL #TATAIPL #Cricket #SBM pic.twitter.com/bVj0mrIomH
— SBM Cricket (@Sbettingmarkets) April 16, 2025
సందీప్ శర్మ కంటే ముందు మహ్మద్ సిరాజ్(Siraj), తుషార్ దేశ్‌పాండే, శార్దూల్ ఠాకూర్(Shardul Thakur).. ఈ చెత్త రికార్డు సాధించారు. 2023లో ఆర్సీబీకి ఆడిన సిరాజ్ ముంబై ఇండియన్స్‌పై 19వ ఓవర్లో 11 బంతులు వేశాడు. అదే సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ యువ పేసర్ తుషార్ దేశ్‌పాండే లక్నో సూపర్ జెయింట్స్‌పై 4వ ఓవర్లో ఏకంగా 11 బంతులు వేశాడు. 18 ఎడిషన్‌లో లక్నో పేసర్ శార్ధూల్ ఠాకూర్ కోల్‌కతా నైట్ రైడర్స్‌పై వరుసగా ఐదు వైడ్స్ వేసి.. 11 బంతుల్లో ఓవర్ పూర్తి చేశాడు.
𝟏𝟏-𝐛𝐚𝐥𝐥 𝐨𝐯𝐞𝐫 𝐚𝐥𝐞𝐫𝐭! 🚨
Sandeep Sharma’s spell vs DC enters the record books for the wrong reason in IPL 2025. 📉#IPL2025 #SandeepSharma #DCvRR pic.twitter.com/UM9uSktT4q
— Sportskeeda (@Sportskeeda) April 16, 2025
ఢిల్లీ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో సందీప్ మొదటి బంతి వైడ్ వేశాడు. రెండోది డాట్ బాల్. ఆ తర్వాత వరుసగా మూడు వైడ్స్.. ఆ వెంటనే నోబాల్ సంధించాడు. దాంతో.. అతడు వేసిన మొదటి ఆరు బంతుల్లో ఒకటే లీగల్ డెలివరీ. ఆ తర్వాతి ఐదు బంతుల్లో 4, 6, 1, 1, 1 పరుగులు సమర్పించుకున్నాడీ స్పీడ్‌స్టర్.