యాచారం, ఏప్రిల్17: బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల్లో భాగంగా ఈనెల 27న వరంగల్‌లో నిర్వహించే బహిరంగ సభకు ప్రజలు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్నాటి రమేష్‌గౌడ్ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని సాయి శరణం ఫంక్షన్ హాల్లో గురువారం బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. వరంగల్ బహిరంగ సభకు సంబంధించిన కార్యాచరణపై చర్చంచారు. ఈ సందర్భంగా రమేష్ గౌడ్ మాట్లాడుతూ..వరంగల్‌లోని ఎల్కతుర్తిలో నిర్వహించే రజతోత్సవ సభకు మండలంలోని అన్ని గ్రామాల నుంచి అధికసంఖ్యలో తరలి వెళ్లాలని ఆయన కోరారు.
ప్రతి గ్రామానికి వాహనాలను పంపించనున్నట్లు తెలిపారు. వేసవిలో సభకు వెళ్తున్న పార్టీ శ్రేణులు, సానుభూతి పరులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా నాయకులు, కార్యకర్తలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజలు బీఆర్ఎస్ పాలనలో సుభిక్షంగా ఉన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ మండల ప్రధాన కార్యదర్శి బాషా, నాయకులు చిన్నోళ్ల యదయ్య, కారింగు యాదయ్య, హబీబ్, జగదీశ్, శ్రీనివాస్, శంకర్‌నాయక్, యాదయ్యగౌడ్, ఖాజు, శివ, గోపాల్, వెంకటేష్, నర్సంహరెడ్డి తదితరులున్నారు.