Bangladesh | బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై ఆగని దాడులు.. 16 ఏళ్ల హిందూ బాలుడి దారుణ హత్య
Bangladesh | బంగ్లాదేశ్ (Bangladesh) లో మైనారిటీలు అయిన హిందువులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఫెనీ జిల్లా (Feny district) లో ఆటోను దొంగిలించేందుకు యత్నించిన కొందరు దుండగులు.. 16 ఏళ్ల హిందూ బాలుడి (Hindhu boy) ని దారుణంగా హత్య చేశారు.
Bangladesh : బంగ్లాదేశ్ (Bangladesh) లో మైనారిటీలు అయిన హిందువులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఫెనీ జిల్లా (Feny district) లో ఆటోను దొంగిలించేందుకు యత్నించిన కొందరు దుండగులు.. 16 ఏళ్ల హిందూ బాలుడి (Hindhu boy) ని దారుణంగా హత్య చేశారు. ఢాకా-చిట్టగాంగ్ హైవేపై లాల్‌పోల్ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుందని అక్కడి మీడియా తెలిపింది.
హత్యకు గురైన బాలుడు శాంతో కుమార్ సాహాగా పోలీసులు గుర్తించారు. అక్కడి మీడియా కథనం ప్రకారం.. మియాజీ ఫిల్లింగ్ స్టేషన్ ముందు ఆటోలో ప్రయాణికుడి కోసం శాంతో ఎదురుచూస్తుండగా.. కొందరు దుండగులు అతడిపై దాడిచేసి, ఆటోను లాక్కునే ప్రయత్నం చేశారు. శాంతో వాళ్లను ప్రతిఘటించడంతో హైవే పక్కన ఉన్న కల్వర్టు కిందకి తోసేశారు. అయినా వెంటనే తేరుకుని దొంగలను వెంబడించిన శాంతోను వారు హత్యచేశారు.
రోడ్డుపై వేగంగా వస్తున్న వాహనం కిందకి శాంతోను తోసేశారు. దాంతో ఆ వాహనం ఢీకొని బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. రాత్రి వరకు బాలుడి ఆచూకీ లేకపోవడంతో కుటుంబసభ్యులు గాలిస్తుండగా.. తెలిసిన ఆటో డ్రైవర్ ద్వారా సమాచారం అందినట్లు శాంతో బంధువులు తెలిపారు.
శాంతో ప్రయాణికులను ఎక్కించుకున్న ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తే నిందితులను గుర్తించే అవకాశం ఉందని అతడి కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఇఫ్తార్ సమయంలో ఉన్న ప్రశాంత వాతావరణాన్ని ఆసరాగా తీసుకుని దుండగులు బాలుడిని టార్గెట్ చేసి, ఆటోను ఎత్తుకెళ్లారని రోపించారు. బంగ్లాదేశ్‌లో కొత్తగా ఏర్పడిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ప్రభుత్వ హయాంలోనూ హిందూ వర్గాలపై దాడులు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తతోంది. గతంలో మహమ్మద్ యూనస్ పాలనలోనూ మైనారిటీలపై వరుసదాడులు జరిగాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

