Peddapally | పెద్దపల్లి రూరల్ ఏప్రిల్ 17: విద్యార్థులుగా చదువుకునే దశ నుంచే ఉత్తమ లక్ష్యంతో కూడిన విద్యాభ్యాసం కొనసాగిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహించడం కష్టమైన పని కాదని గాయత్రీ విద్యాసంస్థల అధినేత, కరెస్పాండెంట్ యెల్లంకీ శ్రీనివాస్ అన్నారు.
మండలంలోని రాఘవాపూర్ లోని రెడ్డి ఫంక్షన్ హాల్ లో గాయత్రీ డిగ్రీ , పీజీ కళాశాల ఫేయిర్ వెల్ డే వేడుకలను గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ విభాగాలకు చెందిన విద్యార్థులు చేసిన నృత్యాలు విశేషంగా ఆకట్టుకుని యువతను ఉర్రూతలూగించాయి. కళాశాలల అధినేత శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతీ విద్యార్థి తమ తల్లిదండ్రుల ఆశయ సాధనకు కృషి చేస్తూనే భవిష్యత్ లో ఉన్నత స్థానంలో నిలిచి మీరు చదువుకున్న విద్యాసంస్థలకు మంచిపేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, మెమోంటోలు, బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల నిర్వాహకురాలు యెల్లంకి రజనీ శ్రీనివాస్, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.