Rohit Sharma | ఐపీఎల్ ముగిసిన తర్వాత టీమిండియా ఇంగ్లాండ్‌లో పర్యటించనున్నది. జూన్ నుంచి ఆతిథ్య జట్టుతో ఐదు టెస్టుల సిరీస్ ఆడనున్నది. ఆ తర్వాత భారత జట్టు బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్తుంది. వన్డే, టీ20 సిరీస్‌లో ఆడుతుంది. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ భారత బౌలర్ల పనిభారంపై ఆందోళన వ్యక్తం చేశాడు. పలువురు ఆటగాళ్లు ఐపీఎల్ తర్వాత కూడా ఫిట్‌గా ఉండడం అవసరమన్నాడు. ముఖ్యంగా బౌలర్ల ఫిట్‌నెస్‌పై ఆందోళన వ్యక్తం చేశాడు. బియాండ్23 క్రికెట్ పాడ్‌కాస్ట్‌లో రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ఐపీఎల్ సమయంలో ప్లేయర్స్ ఫిట్నెస్ మాట్లాడాడు. ఐపీఎల్ బిజీ షెడ్యూల్ నేపథ్యంలో ఐపీఎల్లో ఆడే పలువురు ప్లేయర్స్‌ని వందశాతం ఫిట్‌గా ఉండేలా చూసుకోవాలని.. ఐపీఎల్ నుంచి వారంతా బాగా రాణిస్తున్నారా? లేదా? నిర్దారించుకోవాల్సి ఉందని చెప్పాడు. ఇది అత్యంత సవాల్‌తో కూడుకుదని.. కేవలం వేసేది నాలుగు ఓవర్లే అయినా.. ఒక రోజు మ్యాచ్ ఆడడం.. మరో రోజు ప్రయాణం చేయడం.. మళ్లీ మ్యాచ్ ఆడాల్సి వస్తుందని చెప్పాడు.
ఇది కష్టతమైందని అభిప్రాయపడ్డాడు. దేశవ్యాప్తంగా పలు నగరాలకు ప్రయాణించాల్సి ఉంటుందని.. ప్లేయర్స్ చాలా మ్యాచులు ఆడుతున్నారని తెలిపాడు. ఈ సందర్భంగా కెప్టెన్ రోహిత్ టీమిండియా స్టార్ పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ ఫిట్‌నెస్‌పై స్పందించాడు. ఇద్దరు టీమిండియాకు కీలకమని.. ఇద్దరూ ఎలాంటి ఇబ్బంది లేకుండా టోర్నీని ముగిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పాడు. ఇంగ్లాండ్‌కు పర్యటన వరకు ఫిట్‌గా ఉన్న జట్టు ఉంటే.. అక్కడ సిరీస్‌ని గొప్పగా మొదలుపెట్టొచ్చని చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉండగా.. జూన్‌లో భారత జట్టు ఐదు మ్యాచుల టెస్ట్ సిరీస్ ఆడనున్నది. ఈ సిరీస్ జూన్ 20 నుంచి మొదలుకానున్నది. తొలి మ్యాచ్ లీడ్స్‌లో జరుగుతుంది. రెండో టెస్ట్ జూలై 2 నుంచి బర్మింగ్ హామ్ మొదలవుతుంది. ఇక మూడో టెస్ట్ జూలై 10 నుంచి లార్డ్స్ మైదానంలో, నాలుగో టెస్ట్ 23 నుంచి మాంచెస్టర్‌లో, ఐదో టెస్ట్ 31 నుంచి ఓవల్ మైదానంలో ప్రారంభమవుతుంది.