రాయపోల్, ఫిబ్రవరి 21. సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండలం వడ్డేపల్లి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ జిల్లా యువజన
నాయకుడు రాజేశ్వర్ రెడ్డి కేసీఆర్ను కలిశారు. శనివారం కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్తో కలిసి ఎర్రవల్లిలోని నివాసంలో గులాబీ అధినేతను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా రాయపోల్ మండలానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు, స్థానిక సమస్యలను ఆయన కేసీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. అంతేకాదు స్థానికంగా పార్టీ బలోపేతంపై చర్చించారు. ఈ క్రమంలో రాజేశ్వర్ రెడ్డికి కేసీఆర్ కీలక సూచనలు చేసినట్టు సమాచారం.