వికారాబాద్, ఏప్రిల్ 17 : గ్రామాల్లో తాగునీరు, పారిశుద్ధ్య సమస్యలు రాకుండా చూడాలని ఎంపీడీవో విజయలక్ష్మి పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. గురువారం మోమిన్‌పేట మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గ్రామాలలో తాగునీటి ఏర్పాటు, పారిశుధ్య సౌకర్యాలపై చర్చించారు.
తమ గ్రామాల్లోని అన్ని పాఠశాల భవనాలను కార్యదర్శులు సందర్శించి, వాడలేని తరగతి గదులు ఉన్నచోట విద్యార్థుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బంది సంబంధిత పనులను నిష్టతో పర్యవేక్షించాలని సూచించారు. ఈ సమావేశంలో డీఈ, ఎంఈఓ, ఏఈ పీఆర్ఆర్, ఎంపీవో తదితరులు పాల్గొన్నారు.