హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ) : తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం విశ్రాంత ఐఏఎస్ అధికారి దినేశ్ కుమార్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ను ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
తిరుమల లడ్డూ నెయ్యి కల్తీపై 45 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆ ఉత్తర్వుల్లో ఆదేశించారు.