Private junior colleges | ‘ప్రైవేట్’.. రూట్ సపరేట్.. రాష్ట్రంలో కార్పొరేట్ కాలేజీల ఇష్టారాజ్యం
రాష్ట్రంలోని పలు ప్రైవేట్ జూనియర్ కాలేజీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. అకాడమీల పేరిట యథేచ్ఛగా నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయి. ఒక కాలేజీ పేరిట అనుమతి తీసుకొని మరో కాలేజీ బోర్డు పెట్టి దర్జాగా క్లాసులు నడుపుతున్నాయి. కాలేజీల పేరిట అనుమతులు పొంది కోచింగ్ సెంటర్లను నడుపుతున్నాయి.
- రాష్ట్రంలో కార్పొరేట్ కాలేజీల ఇష్టారాజ్యం….
- పర్మీషన్ ఒక చోట.. తరగతులు మరోచోట
- తాజా ఫేక్ ఫైర్ ఎన్వోసీల కలకలం
- ఇంటర్ బోర్డు పర్యవేక్షణపై ప్రశ్నలు
హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని పలు ప్రైవేట్ జూనియర్ కాలేజీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. అకాడమీల పేరిట యథేచ్ఛగా నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయి. ఒక కాలేజీ పేరిట అనుమతి తీసుకొని మరో కాలేజీ బోర్డు పెట్టి దర్జాగా క్లాసులు నడుపుతున్నాయి. కాలేజీల పేరిట అనుమతులు పొంది కోచింగ్ సెంటర్లను నడుపుతున్నాయి. ఇంటర్ కాలేజీల్లో హాస్టళ్లను నడపడంపైనా అనేక అభ్యంతరాలున్నాయి. తాజాగా ఇంటర్‌బోర్డు గుర్తింపు కోసం కొన్ని కాలేజీలు ఏకంగా హైడ్రా కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేయడం సంచలనం సృష్టించింది. అయినా ఇంటర్‌బోర్డు చోద్యం చూస్తున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
పత్తాలేని పర్యవేక్షణ..
ప్రైవేట్ కాలేజీల్లో అనేక ఉల్లంఘనలు జరుగుతున్నా ఇంటర్‌బోర్డు అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు మొదటి నుంచీ ఉన్నాయి. ఇక అనుమతుల విషయంలోనూ సంబంధిత యాజమాన్యాలతో అధికారులు కుమ్మక్కవుతున్నారని ఇప్పటికే విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాలేజీలకు అఫిలియేషన్లు ఇచ్చేందుకు కనిష్ఠంగా రూ. 50 వేల నుంచి రూ. రెండు లక్షల వరకు చేతులు మారుతున్నాయని విద్యార్థి సంఘాల నేతలు చెబుతున్నారు. ఫేక్ ఫైర్ ఎన్వోసీలను డీఐఈవోలు, ఇతర అధికారులు ఎందుకు గుర్తించలేకపోయారని వారు ప్రశ్నిస్తున్నారు. దీని వెనుక మామూళ్ల వ్యవహారం ఉండటం వల్లే ఈ అనుమతులు లభించాయని చెబుతున్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్న కాలేజీలు, సహకరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
కొన్ని ఉల్లంఘనలిలా..
- ఇంటర్ ఫస్టియర్‌కు రూ.1,760, సెకండియర్‌కు రూ.1,940. ఇవి ఇంటర్ విద్యార్థులు చెల్లించాల్సిన ట్యూషన్ ఫీజులు. కానీ కాలేజీలు వేలల్లో ఫీజులు గుంజుతున్నాయి. రెసిడెన్షియల్ కాలేజీల ఫీజులు రూ. 2.50లక్షల నుంచి రూ. 3లక్షల వరకూ ఉన్నాయి. అయినా ఇంటర్ బోర్డు ఫీజులను అదుపు చేయలేకపోతున్నది.
- పలు కార్పొరేట్ కాలేజీలు అనుబంధ హాస్టళ్లను నిర్వహిస్తున్నాయి. హాస్టళ్లకు సైతం ఇంటర్‌బోర్డు గుర్తింపునిచ్చేందుకు ప్రయత్నాలు జరిగాయి. కాలేజీలు కోర్టుకెళ్లడంతో ఈ విషయం మరుగునపడింది. ఆ తర్వాత ఈ విషయంపై కదలిక లేదు.
- గ్రేటర్లో ఒక కాలేజీ పేరిట పర్మిషన్ తీసుకొని, మరో కాలేజీ పేరిట క్లాసులు నిర్వహిస్తున్నారు. అయినా ఇంటర్‌బోర్డు, అధికారులు చోద్యం చూస్తున్నారు.
- ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీల లెక్చరర్లు మూల్యాంకన విధులకు డుమ్మా కొడుతున్నారు. కాలేజీలు లెక్చరర్లను రిలీవ్ చేయడంలేదు.
- నాలుగైదు కాలేజీలను ఒకే ప్రాంగణంలో నిర్వహిస్తున్నారు. ఒకే ఫ్యాకల్టీ చేత నాలుగైదు కాలేజీల్లో క్లాసులు చెప్పిస్తున్నారు. క్లాసులు చెప్పే వారు ఒకరుంటే.. ట్యూటర్లు, పేపర్లు దిద్దేందుకు ఇతర సిబ్బందిని వినియోగిస్తున్నారు.
- కొన్ని కాలేజీలు అనుమతించిన సంఖ్య కన్నా ఎక్కువ విద్యార్థులను చేర్చుకుంటున్నాయి. తీరా పరీక్షలప్పుడు అనుమతించకపోవడంతో విద్యార్థులను పురమాయించి ఇంటర్‌బోర్డు ఆఫీసు ఎదుట ధర్నాలు చేయిస్తున్నాయి.
- కొన్ని కాలేజీలైతే జేఈఈ, నీట్‌కు శిక్షణనిస్తున్నాయి. ఇంటర్ పరీక్షల సిలబస్‌ను తక్కువగా బోధిస్తున్న కాలేజీలు కూడా ఉన్నాయి. కొన్ని కాలేజీల్లో అయితే ఇంగ్లిష్, సంస్కృతం, తెలుగు, హిందీ వంటి సబ్జెక్టుల బోధనను మమ అనిపించేస్తున్నారు.
- నిబంధనలకు విరుద్ధంగా వేసవి సెలవుల్లో, దసరా, సంక్రాంతి సెలవుల్లో క్లాసులు నిర్వహిస్తున్నాయి.
- కొన్ని కాలేజీలైతే తప్పుడు ర్యాంకులతో విద్యార్థులను తప్పుదోవపట్టిస్తున్నాయి. ఒకే ర్యాంకర్‌ను రెండు కాలేజీలు తమ విద్యార్థిగా ప్రచారం చేసుకుంటున్నాయి.
- కార్పొరేట్ కాలేజీల్లోని విద్యార్థులు ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పరీక్షల భయం తెలంగాణ విద్యార్థుల్లోనే అధికంగా ఉన్నట్టు కేంద్రం కొంతకాలం క్రితం ఆందోళన వ్యక్తం చేసింది.
టాస్క్‌ఫోర్స్ చేత తనిఖీలు చేయిస్తాం
కాలేజీల అఫిలియేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత ప్రైవేట్ కాలేజీల్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తాం. టాస్క్‌ఫోర్స్ కమిటీలేసి ప్రతి కాలేజీలోనూ తనిఖీలు నిర్వహిస్తాం. ఫేక్ ఫైర్ ఎన్వోసీల వ్యవహారంపై పోలీసుల విచారణ జరుగుతున్నది. ప్రస్తుతానికి ఆయా కాలేజీల ఆఫిలియేషన్ను నిలిపివేశాం. ఇంకా కొన్ని ఫైర్ ఎన్వోసీల పరిశీలన జరుగుతున్నది. అన్ని అంశాలపై హైడ్రా నుంచి పూర్తి నివేదిక అందగానే కఠిన చర్యలు తీసుకుంటాం. ఎలాంటి చర్యలు తీసుకుంటామన్నది ఇప్పుడే చెప్పలేం.
– అభిలాష అభినవ్,ఇంటర్ బోర్డు కార్యదర్శి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

