కొత్తగూడెం టౌన్, ఆగస్టు 5: రైతులను ఇబ్బందులకు గురిచేసే విధంగా ఉన్న యూరియా యాప్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీసీఎం ఆధ్వర్యంలో సుజాతనగర్లో బుధవారం రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ఫేం వర్క్ ఫర్ ఫర్టిలైజర్ సేల్’ అనే కొత్త యాప్ను వెంటనే రద్దు చేయాలని, పాత పద్ధతిలోనే యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంత రైతులకు ఆధునిక సెల్ఫోన్లు లేకపోవడం.. యాప్లో బుక్ చేసే విధానం రాకపోవడం వంటి కారణాలతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పార్టీ నాయకులు పాల్గొన్నారు.