హైదరాబాద్, ఆగస్టు 5(నమస్తే తెలంగాణ): ‘షార్ట్‌కట్ పద్ధతిలో ముఖ్యమంత్రి అయిన రేవంత్‌రెడ్డి, సీఎం కుర్చీ హుందాతనాన్ని కాపాడకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నడు. రాష్ట్ర ప్రజల కోసం నిరంతరం పరితపిస్తూ హార్డ్‌వర్క్ చేస్తున్న హరీశ్‌రావు క్షుద్రపూజలు చేశాడని తన తాబేదార్లతో అడ్డగోలుగా మాట్లాడిస్తున్నడు’ అని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ నేతలు హరీశ్, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పడం చేతగాక తాంత్రిక పూజల పేరిట బురదజల్లుతున్నారని మండిపడ్డారు. ‘రేవంత్‌రెడ్డి పాలనలో గ్లామర్ లేదు.. ఆయన భాషలో గ్రామర్ లేదు.. అద్దంకి దయాకర్‌కు బుది ్ధలేదు.. సామ రామ్మోహన్‌కు తెలివి లేదు.. సంపత్‌కుమార్‌కు సంస్కారం లేదు’ అంటూ ఫైర్ అయ్యారు. బుధవారం తెలంగాణ భవన్లో విలేకరులతో ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆరు గ్యారెంటీలు అమలుచేస్తామని గద్దెనెక్కిన రేవంత్‌రెడ్డి.. బూతులు, భూతాల ఎజెండాతో కాలక్షేపం చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ మెప్పు కోసం పాకులాడుతున్న అద్దంకికి క్షుద్ర, శూద్ర పూజలకు తేడా తెలియదని ఎద్దేవా చేశారు.
హిందూ ధర్మాన్ని కించపరుస్తున్నరు..
మూఢ నమ్మకాలను విశ్వసించవద్దని ప్రజలను చైతన్యవంతం చేయాల్సిన కాంగ్రెస్ నాయకులు, క్షుద్రపూజల గురించి మాట్లాడుతూ హిందూధర్మాన్ని కించపరిచేలా ప్రవరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఓయూలో చదివిన సంపత్‌కుమార్.. గురుకులాల కార్యదర్శిగా పేద పిల్లల అభ్యున్నతికి పాల్పడ్డ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌పై చిల్లరగా మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. గురుకులాల్లో అవినీతి, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్, దళితబంధు అమలు గురించి సీఎంను ప్రశ్నించడం చేతగాని కాంగ్రెస్ దద్దమ్మలు.. కేటీఆర్, హరీశ్‌రావుపై ఎగిరెగిరిపడటం విడ్డూరమన్నారు. కేటీఆర్, హరీశ్ ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము లేకే వారిపై అసహనం వ్యక్తం చేస్తున్నట్టు పేర్కొన్నారు.
బాబు నీళ్లు ఎత్తుకెళ్తుంటే ఏం చేస్తున్నరు?
చంద్రబాబు గోదావరి నీళ్లు ఎత్తుకెళ్తుంటే నిలువరించాల్సిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు గుడ్లప్పగించి చూస్తున్నారని దెప్పిపొడిచారు. ఏసీబీ దాడుల్లో పట్టుబడ్డ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అధికారులకు కఠినశిక్షలు విధిస్తూ అగ్రవర్ణ అధికారులను విస్మరిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా అధికార పార్టీ నేతలు సోయి తెచ్చుకొని పథకాల అమలుపై దృష్టిపెట్టాలని హితవుపలికారు. లేదంటే వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారని ఆయన హెచ్చరించారు.
చిల్లర భాష బంద్‌పెట్టి హామీలు నెరవేర్చండి ; ప్రశ్నిస్తున్నందుకే హరీశ్‌రావు, ఆర్ఎస్పీపై ప్రేలాపనలు చిరుమర్తి లింగయ్య
కాంగ్రెస్ నాయకుల్లారా.. చిల్లరభాష బంద్‌పెట్టి, ప్రజలకు ఇచ్చిన హామీల ను నెరవేర్చండి’ అని నకిరేకల్ మాజీ ఎ మ్మెల్యే చిరుమర్తి లింగయ్య హితవు పలికా రు. హరీశ్‌రావు, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మం డిపడ్డారు. క్షుద్రపూజల పేరిట డైవర్షన్ డ్రా మాలకు తెరలేపారని విరుచుకుపడ్డారు. బు ధవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నా యకులు రాంబల్‌నాయక్, తుంగ బాలు, శరత్, యాదయ్య, నరేశ్‌రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. హరీశ్‌రావుకు వస్తు న్న ఆదరణ చూసి ఓర్వలేకే క్షుద్రపూజలు అంటూ చిల్లరమాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. వైఎస్సార్ గాలిలో ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచిన సంపత్‌కుమార్, ఆర్ఎస్పీని ఉద్దేశించి డస్ట్‌బిన్ అనడం శోచనీయమని, చిల్లర పనులు చేస్తూ పిచ్చిప్రేలాపనలు చేసే ఆయనే వచ్చే ఎన్నికల్లో డస్ట్‌బిన్‌లోకి పోవడం ఖాయమని ఎద్దేవాచేశారు. కేసీఆర్ అడుగుజాడల్లో రాత్రింబవళ్లు తెలంగాణ అభ్యున్నతి కోసం శ్రమించిన ఆయన పై అభాండాలు వేయడం దుర్మార్గమని ధ్వ జమెత్తారు. నోటిదురుసు ఎక్కువని తెలిసే అద్దంకి దయాకర్‌కు తుంగతుర్తి ప్రజలు క ర్రుకాల్చి వాత పెట్టినట్టు గుర్తుచేశారు. తీరు మారకుంటే ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు.