IND vs ENG 2nd T20I : ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఇవాళ రెండో మ్యాచ్ జరుగుతోంది. తమిళనాడు రాజధాని చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఈ మ్యాచ్ కొనసాగుతోంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇంగ్లండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. అయితే ఈ మ్యాచ్ కోసం టీమిండియా రెండు మార్పులు చేసింది. గాయాలు కావడంతో యువ ఆటగాళ్లు నితీశ్ కుమార్ రెడ్డి, రింకూసింగ్‌లను తుది జట్టు నుంచి తప్పించింది.
వారి స్థానంలో వాషింగ్టన్ సుందర్, ధృవ్ జురేల్‌లకు తుది జట్టులో చోటు కల్పించింది. గాయం కారణంగా నితీశ్ కుమార్ రెడ్డి ఈ సిరీస్‌కు పూర్తిగా దూరమయ్యాడు. రింకూ సింగ్ రెండో మ్యాచ్‌తోపాటు మూడో మ్యాచ్‌కు కూడా అందుబాటులో ఉండదు. అయితే వరుసగా రెండో టీ20 మ్యాచ్‌లో కూడా ఇండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీకి తుది జట్టులో చోటు దక్కలేదు. గాయం కారణంగా జట్టుకు దూరమై ఈ సిరీస్‌తోనే మళ్లీ జట్టులోకి వచ్చిన షమీకి తుది జట్టులో తప్పకుండా చోటు కల్పిస్తారని అంతా భావించారు.
కానీ అందుకు విరుద్ధంగా సూర్యకుమార్ యాదవ్ వరుసగా రెండు మ్యాచ్‌లకు షమీని పెవిలియన్‌కే పరిమితం చేశాడు. దాంతో చాన్నాళ్లకు షమీ బౌలింగ్ చూసే అవకాశం దక్కిందని ఆశపడ్డ ఆయన అభిమానులకు అసంతృప్తే మిగిలింది. మిగిలిన మూడు మ్యాచ్‌లకైనా షమీకి ఫైనల్ ఎలెవన్‌లో చోటు కల్పిస్తారా.. లేదా.. వేచిచూడాలి. కాగా ఐదు మ్యాచ్‌లో సిరీస్‌లో తొలి మ్యాచ్ నెగ్గి టీమిండియా 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇవాళ రెండో మ్యాచ్ జరుగుతోంది.
Health tips | రోజూ ఈ గింజలు తింటే కొవ్వు ఐస్‌లా కరిగిపోతుంది తెలుసా..?
Amit Shah | ‘యమునా నదిలో మునిగితేలు’.. కేజ్రీవాల్‌పై మండిపడ్డ అమిత్ షా
Australian Open | ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత మాడిసన్ కీస్.. ఫైనల్లో ఓడిన టాప్ సీడ్ సబలెంక
Arrest | అక్రమంగా పెయిన్ కిల్లర్స్ విక్రయం.. మణిపూర్ మహిళ అరెస్ట్
SBI Report | మహిళలకు ఉచితాలు.. రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలు కుదేలు : ఎస్బీఐ తాజా నివేదిక
Saif Ali Khan case | ‘నా కొడుకును అక్రమంగా ఇరికించారు..’ భారత మీడియా సంస్థతో సెహజాద్ తండ్రి