గురువారం 04 మార్చి 2021
Sports - Feb 21, 2021 , 01:02:55

ఐపీఎల్‌ స్టార్లకు అందలం

ఐపీఎల్‌ స్టార్లకు అందలం

భారత టీ20 జట్టులోకి సూర్యకుమార్‌, కిషన్‌, తెవాటియా

న్యూఢిల్లీ: ఐపీఎల్‌లో మెరుపులు మెరిపించిన యువ క్రికెటర్ల ప్రదర్శనకు గుర్తింపు లభించింది. ఇంగ్లండ్‌తో అహ్మదాబాద్‌ వేదికగా జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం బీసీసీఐ 19 మందితో శనివారం జట్టును ప్రకటించింది. యూఏఈలో గతేడాది జరిగిన ఐపీఎల్‌లో అదరగొట్టిన సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌, రాహుల్‌ తెవాటియా టీమ్‌ఇండియాకు తొలిసారి ఎంపికయ్యారు. గాయం నుంచి కోలుకున్న స్వింగ్‌స్టర్‌ భువనేశ్వర్‌ తిరిగి జట్టులోకి రాగా, రిషబ్‌ పంత్‌, అక్షర్‌ పటేల్‌కు మళ్లీ టీ20ల్లో చోటు దక్కింది. యార్కర్‌ స్పెషలిస్టు బుమ్రాకు విశ్రాంతినివ్వగా, కుల్దీప్‌, శాంసన్‌, మనీశ్‌ పాండేకు చుక్కెదురైంది. స్వదేశం వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని జట్టును ఎంపిక చేసినట్లు  తెలుస్తున్నది. 

జట్టు వివరాలు: కోహ్లీ(కెప్టెన్‌), రోహిత్‌శర్మ(వైస్‌ కెప్టెన్‌), రాహుల్‌, ధవన్‌, అయ్యర్‌, సూర్యకుమార్‌, హార్దిక్‌, పంత్‌, కిషన్‌, చాహల్‌, చక్రవర్తి, పటేల్‌, సుందర్‌, తెవాటియా, నటరాజన్‌, భువనేశ్వర్‌, చాహర్‌, సైనీ, శార్దుల్‌ 

VIDEOS

logo