జియో డాటా లోన్

- ‘రీచార్జ్ నౌ.. పే లేటర్’ ఆఫర్
- తమ మొబైల్ యూజర్లకు ఎమర్జన్సీ సదుపాయం కల్పించిన సంస్థ
న్యూఢిల్లీ, జూలై 3: మీ మొబైల్లో హఠాత్తుగా డాటా అయిపోయి ఇంటర్నెట్ బ్రౌజ్ చేయలేకపోతున్నారా?.. కంగారుపడకండి. డాటాను రుణంగా ఇచ్చే సదుపాయాన్ని రిలయన్స్ జియో తాజాగా ప్రవేశపెట్టింది. ‘రీచార్జ్ నౌ.. పే లేటర్’ పేరుతో ప్రారంభించిన ఈ ప్లాన్‌తో జియో యూజర్లు తక్షణం డాటా లోన్ తీసుకోవచ్చు. రోజువారీ డాటా అయిపోతే, వివిధ కారణాలతో ప్రీ-పెయిడ్ యూజర్లు వెంటనే డాటా టాప్అప్ను వేసుకోలేరని, అటువంటివారు ఈ సదుపాయం ద్వారా 1 జీబీ చొప్పున 5 జీబీల వరకూ లోన్ ప్యాక్స్ పొందవచ్చని కంపెనీ శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నది. ఒక్కో జీబీ ప్యాక్ ఖరీదు రూ.11. మైజియో యాప్ ద్వారా ఈ లోన్ పొందవచ్చు. అయితే ఈ డాటా లోన్ పొందాలంటే ఆయా యూజర్ల రీచార్జ్ ప్యాక్ కాలపరిమితి ముగిసి ఉండకూడదు. లోన్‌గా పొందిన డాటాను రీచార్జ్ వోచర్ కాలపరిమితి ముగిసేవరకూ ఎప్పుడైనా వాడుకోవచ్చు. నిర్దేశించిన చెల్లింపు గడువు తేదీలోగా, ఈ డాటా లోన్‌ను మైజియో యాప్ ద్వారానే తిరిగి చెల్లించాల్సి ఉంటుందని సంస్థ స్పష్టం చేసింది.
డాటా లోన్ తీసుకోవడమెలా?
- మైజియో యాప్ ఇన్స్టాల్ చేసి, ఓపెన్ చేయండి
- హోం స్క్రీన్‌లో పైన లెఫ్ట్‌లో ఉండే మూడు గీతలపై క్లిక్ చేయండి
- అందులో మొబైల్ ఆప్షన్లో సబ్ ఆప్షన్‌గా ఉన్న ఎమర్జన్సీ డాటా లోన్‌పై క్లిక్ చేయండి
- తదుపరి ప్రొసీడ్‌ను ట్యాప్ చేసి ‘గెట్ ఎమర్జన్సీ డాటా’ను సెలక్ట్ చేయండి
- చివరగా యాక్టివేట్ను ట్యాప్ చేయండి
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- jio
- loan in jio
- recharge
RELATED ARTICLES
తాజా వార్తలు
Destiny | నందినీ రెడ్డి చేతుల మీదుగా ‘డెస్టినీ’ ఫస్ట్ లుక్ లాంచ్.. ఇంట్రెస్టింగ్గా ఇమ్మాన్యుయేల్ లుక్!
శ్రీ రామలింగేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్‌ను సత్వరమే పూర్తి చేయాలి : మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్
KTR | సహకార సంఘాల బలోపేతానికి బీఆర్ఎస్ సహకారం : కేటీఆర్
Plague Disease | ప్లేగు వ్యాధిలో అసలు ఎన్ని రకాలు ఉన్నాయి.. ఈ వ్యాధి ఎలా వస్తుంది..?
PM Modi | కెనడాలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. డిసెంబర్ 11, 12 తేదీల్లో షెడ్యూల్ ఖరారు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

