రూ.37 లక్షల బైక్.. 24 గంటల్లోనే బుకింగ్స్ క్లోజ్

ముంబై: ఆ బైకు ధర రూ.37,20,342. కానీ ఫస్ట్ లాట్ కోసం బుకింగ్స్ ప్రారంభించిన 24 గంటల్లోనే పూర్తయిపోవడం విశేషం. హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) ఈ మధ్యే ప్రకటించిన గోల్డ్ వింగ్ టూర్ బైక్‌కు ఇండియాలో ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఈ బైకు ప్రారంభ ధరను రూ.37.20 లక్షలుగా నిర్ణయించినా.. ఎగబడి కొన్నారు. గత జూన్‌లోనే ఈ సూపర్‌బైక్ గోల్డ్ వింగ్ టూర్ అప్డేటెడ్ వెర్షన్‌ను హోండా మోటార్‌సైకిల్ ఇండియాలో లాంచ్ చేసింది. ఇది పూర్తిగా జపాన్‌లోనే తయారై ఇండియాకు రానుంది.
1833 సీసీ గోల్డ్ వింగ్ టూర్ బైక్ రెండు వేరియంట్లలో వస్తోంది. ఎయిర్‌బ్యాగ్‌తో కూడిన డ్యుయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ (డీసీటీ) ఒకటి కాగా.. మాన్యువల్ ట్రాన్స్మిషన్ మరకొటి. సెవన్ స్పీడ్ డ్యుయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ మోడల్ ధరను రూ.39,16,055గా నిర్ణయించగా.. మరో వేరియంట్‌కు రూ.37,20,342 (ఎక్స్-షోరూమ్, గుర్గావ్)గా నిర్ణయించారు. ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటోను ఈ బైక్ సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

