7న మోదీ క్యాబినెట్ విస్తరణ.. ముగ్గురు మాజీ సీఎంలకు చోటు?!
7న మోదీ క్యాబినెట్ విస్తరణ.. ముగ్గురు మాజీ సీఎంలకు చోటు?!| ప్రధాని నరేంద్రమోదీ తన క్యాబినెట్‌ను బుధవారం విస్తరించనున్నారని సమాచారం.. ..

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ బుధవారం (ఈ నెల 7) నాడు తన క్యాబినెట్‌ను విస్తరించనున్నారు. బుధవారం మధ్యాహ్నం 11 గంటలకు మోదీ 2.0 ప్రభుత్వంలో తొలిసారి క్యాబినెట్ విస్తరణ కానున్నది. ప్రస్తుతం 28 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి.
దీని ప్రకారం 17-22 మంది ఎంపీలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. క్యాబినెట్ విస్తరణపై రెండు రోజులుగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌లతో చర్చలు జరుపుతున్నారు.
క్యాబినెట్ విస్తరణలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఉత్తరప్రదేశ్‌తోపాటు బీహార్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం లభిస్తుందని తెలుస్తున్నది.

మధ్యప్రదేశ్ నుంచి సింధియాకు చోటు
మధ్యప్రదేశ్‌లో తిరిగి బీజేపీ ప్రభుత్వం కొలువు దీరడంలో కీలక భూమిక వహించిన యువనేత జ్యోతిరాదిత్య సింధియా, జబల్పూర్ ఎంపీ రాకేశ్ సింగ్ లకు చోటు దక్కవచ్చు. మరో ఇద్దరు నేతలకు కూడా మధ్యప్రదేశ్ నుంచి చాన్స్ లభిస్తుందని తెలుస్తున్నది.

బీహార్‌లో ఎల్జేపీ నేత పశుపతి కుమార్ పరాస్
బీహార్‌లో లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) ఎంపీ పశుపతి కుమార్ పరాస్, జేడీయూ నేత ఆర్సీపీ సింగ్‌లు మంత్రులుగా ప్రమాణం చేయొచ్చు. ఈ రాష్ట్రం నుంచే ఇద్దరు లేదా ముగ్గురు నేతలకు చోటు దక్కుతుందని చర్చలు జరుగుతున్నాయి.

యూపీలో మళ్లీ అనుప్రియా పటేల్‌కు చోటు
ఉత్తరప్రదేశ్‌లోని అప్నాదళ్ అధినేత అనుప్రియా పటేల్ పేరు ప్రధానంగా వినిపిస్తున్నది. ఆమె గత నెలలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలుసుకున్నారు. ఇక వరుణ్‌గాంధీ, రాంశంకర్ కథేరియా, అనిల్ జైన్, రీటా బహుగుణ జోషి, జాఫర్ ఇస్లాం పేర్లు కూడా వినిపిస్తున్నాయి.

మహారాష్ట్రలో నలుగురి పేర్లపై ప్రస్తావన
ఇక మహారాష్ట్రలోని బీజేపీ ఎంపీ హీనా గావిట్ కేంద్ర మంత్రిగా ప్రమాణం చేయనున్నారు. వీరితోపాటు భూపేంద్ర యాదవ్, పూనం మహాజన్, ప్రీతం ముండే పేర్లు ప్రస్తావనలో ఉన్నాయి.

ముగ్గురు మాజీ సీఎంలకూ క్యాబినెట్ బెర్త్
ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులు, ఒక మాజీ డిప్యూటీ సీఎంనూ మోదీ తన క్యాబినెట్లోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తున్నది.

ఆ ముగ్గురు మాజీ సీఎంలు వీరే
ఉత్తరాఖండ్ మాజీ సీఎం తీరత్ సింగ్ రావత్, అసోం మాజీ ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్, మహారాష్ట్ర మాజీ సీఎం నారాయణ్ రాణె కూడా కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు.

బీహార్ ఎక్స్ డిప్యూటీ సీఎం సుశీల్ మోదీ కూడా
ఉత్తరాఖండ్ సీఎంగా తీరత్ సింగ్ రావత్ ఈ నెల మూడో తేదీనే రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇక బీహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ కూడా క్యాబినెట్లో బెర్త్ లభించే అవకాశం ఉంది.

లడఖ్ ఎంపీ జామ్యాంగ్ నాంగ్యాల్కు చోటు
వీరితోపాటు బీజేపీ ఎంపీలు జామ్యాంగ్ నాంగ్యాల్ (లడఖ్), అజయ్ భట్ లేదా అనిల్ బాలూనీ (ఉత్తరాఖండ్), ప్రతాప్ సిన్హా (కర్ణాటక), జగన్నాథ్ సర్కార్ (పశ్చిమ బెంగాల్), శంతను ఠాకూర్ లేదా నితీష్ ప్రమాణిక్, బ్రిజేంద్ర సింగ్ (హర్యానా) పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి.
ఇంకా బీజేపీ ఎంపీలు రాహుల్ కాస్వాన్ (రాజస్థాన్), అశ్విని వైష్ణవ్ (ఒడిశా), పర్వేశ్ వర్మ లేదా మీనాక్షి లేఖి (ఢిల్లీ) పేర్లను క్యాబినెట్లోకి తీసుకునే విషయమై అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు వినికిడి.

క్యాబినెట్ నుంచి ఆ ఇద్దరిలో ఒకరు ఔట్?
ప్రస్తుతం మధ్యప్రదేశ్ నుంచి మోదీ క్యాబినెట్లో నలుగురు మంత్రులు ఉన్నారు. నరేంద్ర సింగ్ తోమర్, థావర్ చంద్ గెహ్లాట్, ఫగన్ సింగ్ కులస్తే, ప్రహ్లాద్ పటేల్ మంత్రులుగా ఉన్నారు.
వీరిలో థావర్ చంద్ గెహ్లాట్, ఫగన్ సింగ్ కులస్తేల్లో ఒకరిని సాగనంపుతారని తెలుస్తున్నది. 2014లో మోదీ కేంద్రంలో అధికారం చేపట్టినప్పటి నుంచి థావర్ చంద్ గెహ్లాట్ మంత్రిగా ఉన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
ఇతర దేశాలకు అందుబాటులో కోవిన్ పోర్టల్: ప్రధాని మోదీ
స్పీకర్‌పై చేయి చేసుకున్న బీజేపీ ఎమ్మెల్యేలు.. 12 మందిపై ఏడాది వేటు
హక్కుల నేత స్టాన్ స్వామి మృతి
నా వాళ్లే నాకు ద్రోహం చేశారు: చిరాగ్ పాశ్వాన్
జమ్మూ వైమానిక స్థావరంపై ఆర్డీఎక్స్, నైట్రేట్‌తో డ్రోన్ల దాడి
రూ.37 లక్షల బైక్.. 24 గంటల్లోనే బుకింగ్స్ క్లోజ్
అమెజాన్ సీఈవో పదవికి బెజోస్ గుడ్‌బై.. ఎందుకు? ఆయన భవిష్యత్తు ఏంటి?
వ్యక్తిగత జీవితంపై వర్క్ ఫ్రం హోం ప్రభావం
3జీ, 4జీ, 5జీ తెలుసు.. మరి ‘జీరో’ జీ ఉందని తెలుసా !
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

