అమెజాన్ సీఈవో పదవికి బెజోస్ గుడ్‌బై.. ఎందుకు? ఆయన భవిష్యత్తు ఏంటి?

వాషింగ్టన్: అమెజాన్.. ఈ-కామర్స్ ఫీల్డ్‌లో ఈ పేరు ఓ సంచలనం. 27 ఏళ్ల కిందట తన గ్యారేజ్‌లో ఈ సంస్థను ప్రారంభించిన ఆ సంస్థ ఫౌండర్ జెఫ్ బెజోస్.. ఇప్పుడు ప్రపంచంలోని టాప్ ఈ-కామర్స్ కంపెనీల్లో ఒకటిగా నిలిపారు. అయితే ఓ కొత్త రంగంవైపు అడుగులు వేస్తున్న ఆయన.. ఇక అమెజాన్ సీఈవో పదవికి గుడ్‌బై చెప్పేస్తున్నారు. సోమవారం ఆయన నుంచి ఆండీ జాసీ ఆ పదవిని స్వీకరించనున్నారు.
బెజోస్ ఏం చేయబోతున్నారు?
అమెజాన్‌ను టాప్ కంపెనీల్లో ఒకదానిగా నిలిపి.. ప్రపంచ కుబేరుల్లో స్థానం సంపాదించిన జెఫ్ బెజోస్ ఇక నుంచి ఏం చేయనున్నారో తెలుసుకోవాలన్న ఆసక్తి చాలా మందిలో ఉంది. అయితే ఆయన కన్ను ఇప్పుడో అంతరిక్షంపై పడింది. బ్లూ ఆరిజిన్ పేరుతో ఇప్పటికే ఓ స్పేస్ కంపెనీని ఆయన ప్రారంభించారు. ఇది రూపొందించిన స్పేస్‌క్రాఫ్ట్‌లోనే ఈ నెలలో ఆయన స్పేస్‌లోకి వెళ్లబోతున్నారు.
భవిష్యత్తులో ఎక్కువ సమయాన్ని ఆయన దీనికోసమే కేటాయించనున్నారు. దీనికితోడు దాతృత్వ కార్యక్రమాలపైనా మరింత దృష్టి సారించనున్నారు. ఆయన ఇప్పటికే వాషింగ్టన్ పోస్ట్ పత్రికకు ఓనర్. ఇక ఇప్పటికే వాతావరణ మార్పులపై ఆందోళన వ్యక్తం చేస్తూ దీనిపై అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టారు.
పుస్తకాలు అమ్మే స్థాయి నుంచి..
బెజోస్ ఎదిగిన తీరు ఎంతో మంది యువ పారిశ్రామికవేత్తలకు స్ఫూర్తి కలిగించేదే. అసలు ఆన్లైన్లో షాపింగ్ చేస్తే., వస్తువులలు నేరుగా ఇంటికి సరఫరా చేయడమనే ఎవరూ ఊహించని ఓ కొత్త సాంప్రదాయానికి తెరతీసిన ఘనత ఆయనదే. అమెజాన్ సంస్థను తన గ్యారేజ్‌లో ప్రారంభించిన సమయం గురించి ఆయన పదేపదే చెబుతుంటారు. తానే సొంతంగా ఆర్డర్లు తీసుకొని, వాటిని ప్యాక్ చేసి, ఆ బాక్స్‌లను పోస్ట్ ఆఫీస్‌లకు తీసుకెళ్లిన రోజులను నెమరేసుకుంటారు.
అలాంటి స్థితి నుంచి ఇప్పుడు అమెజాన్ మార్కెట్ విలువ 1.7 లక్షల కోట్లకు చేరడంలో.. బెజోస్ వినూత్న ఆలోచనలు, ఆయన తీసుకున్న రిస్క్‌లే కీలకపాత్ర పోషించాయనడంలో ఎలాంటి సందేహం లేదు. గతేడాది అమెజాన్ వార్షిక ఆదాయం 38600 కోట్ల డాలర్లకు చేరింది. ఈ-కామర్స్, క్లౌడ్ కంప్యూటింగ్, కిరాణా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్ట్రీమింగ్ మీడియా వంటి రంగాల్లోకి అమెజాన్ అడుగుపెట్టింది. భవిష్యత్తు అవసరాలను ముందే పసిగట్టి.. అందుకు అనుగుణంగా తన బిజినెస్‌లో మార్పులు చేర్పులు చేయడంలోనే బెజోస్ సక్సెస్ దాగి ఉన్నదని విశ్లేషకులు చెబుతారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

