IND vs PAK : భారత్, పాకిస్థాన్‌ల మధ్య క్రికెట్ ఇక అసాధ్యం అనుకుంటున్న వేళ ఆసియా కప్ (Asia Cup 2025) షెడ్యూల్ విడుదలైంది. సెప్టెంబర్ 14న దాయాదుల మ్యాచ్ ఉందని తెలియడంతో నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. పహల్గాంలో అమాయకులను బలిగొన్న ఉగ్రవాదులను పెంచిపోషించిన పాక్‌తో క్రికెట్టా అని బీసీసీఐ(BCCI)ని కడిగిపారేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్‌లు ఒకే గ్రూప్‌లో ఉండడంతో తప్పనిసరిగా లీగ్ మ్యాచ్ ఆడాల్సిన పరిస్థితి. అయితే.. వరల్డ్ ఛాంపియన్స్ లీగ్ ఆఫ్ లెజెండ్స్‌లో మాజీ ఆటగాళ్లు పాక్‌తో మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేసినట్టుగానే ఈ మ్యాచ్‌ను లైట్ తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు. డబ్బుల కోసమే బీసీసీఐ ఈ టోర్నీలో ఆడేందుకు అంగీకరించిందని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇరుదేశాల మ్యాచ్‌పై సర్వాత్ర ఆగ్రహం వ్యక్తమవుతున్న వేళ గంగూలీ క్రికెట్ కాదు ఉగ్రవాదం అంతమవ్వాలని తన అభిప్రాయాన్ని చాలా స్పష్టంగా చెప్పాడు.
#WATCH | Kolkata: On India-Pakistan placed in the same group in the Asia Cup, former Indian cricketer Saurav Ganguly says, “I am okay. The sport must go on. At the same time Pahalgam should not happen, but the sport must go on. Terrorism must not happen; it needs to be stopped.… pic.twitter.com/Qrs17KOKrN
— ANI (@ANI) July 27, 2025
‘పాకిస్థాన్‌తో ఆడడంలో నాకేమీ అభ్యంతరం లేదు. ఎందుకంటే ఇరుదేశాల మధ్య సంబంధాలు ఎలా ఉన్నా ఆట మాత్రం కొనసాగాలి. అదే సమయంలో పహల్గాం వంటి ఉగ్రదాడులు జరగకూడదు. టెర్రరిజం అంతం కావాలి. ఇప్పటికే మనదేశం ఉగ్రవాదంపై కఠినమైన చర్యలు తీసుకుంటోంది. అందుకే.. క్రికెట్ ఆడడంలో విమర్శ తగదు’ అని దాదా వెల్లడించాడు.
JUST IN: India will play Pakistan on Sunday, September 14 in a group-stage fixture of the men’s Asia Cup pic.twitter.com/todacEzdZS
— ESPNcricinfo (@ESPNcricinfo) July 26, 2025
నిరుడు అమెరికాలో టీ20 వరల్డ్ కప్‌లో ఢీకొన్న భారత్, పాక్ జట్లు ఆసియా కప్ (Asia Cup 2025)లో అమీతుమీకి సిద్ధమవుతున్నాయి. ఒకే గ్రూప్‌లో ఉన్న దాయాది జట్ల మ్యాచ్ సెప్టెంబర్ 14 ఆదివారం జరుగునుంది. శనివారం ఆసియా క్రికెట్ మండలి(ACC) పూర్తి షెడ్యూల్ విడుదల చేసింది. సెప్టెంబర్ 9 నుంచి మొదలయ్యే ఈ టోర్నీకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆతిథ్యం ఇవ్వనుంది. భారత్, పాక్‌తో పాటు యూఏఈ, ఒమన్ జట్లు గ్రూప్ ఏలో ఉన్నాయి. గ్రూప్ బిలో శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్థాన్, హాంకాంగ్ చోటు దక్కించుకున్నాయి. వచ్చే ఏడాది ఆరంభంలో పొట్టి వర్డ్ కప్ నేపథ్యంలో ఈసారి ఆసియా కప్‌లోను టీ20 ఫార్మాట్లో నిర్వహించనున్నారు. రౌండ్ రాబిన్ పద్ధతిలో జరిగే ఈ టోర్నీలో 19 మ్యాచ్‌లు ఉంటాయి.