లక్నో: అస్వస్థతకు గురైన కుమార్తెను తండ్రి ఆసుపత్రికి తీసుకెళ్తున్నాడు. బంధువుతో కలిసి స్కూటర్‌పై వెళ్తుండగా బీఎండబ్ల్యూ కారు దూసుకొచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ చిన్నారి మరణించింది. (BMW Rams Scooter, Girl Dies) తండ్రి, బంధువు తీవ్రంగా గాయపడ్డారు. దేశ రాజధాని ఢిల్లీ శివారు ప్రాంతమైన ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఈ సంఘటన జరిగింది. సెక్టార్ 45 సమీపంలోని సదర్‌పూర్‌లో నివసించే గుల్ మొహమ్మద్ ఐదేళ్ల కుమార్తె ఆయత్ శనివారం రాత్రి అనారోగ్యానికి గురైంది. దీంతో కుమార్తెను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు బంధువైన రాజాతో కలిసి స్కూటర్‌పై బయలుదేరాడు.
కాగా, వేగంగా దూసుకొచ్చిన బీఎండబ్ల్యూ కారు ఆ స్కూటర్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో చిన్నారి ఆయత్ అక్కడికక్కడే మరణించింది. ఆమె తండ్రి గుల్ మొహమ్మద్, బంధువు రాజా ఈ ప్రమాదంలో గాయపడ్డారు. వారిని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు ఈ ప్రమాదంలో బీఎండబ్ల్యూ కారు, స్కూటర్ ధ్వంసమయ్యాయి. బాలిక మరణానికి కారణమైన డ్రైవింగ్ చేసిన యష్ శర్మ, కారులో ఉన్న అభిషేక్ రావత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:
‘Ladki Bahin’ Scheme | ‘లడ్కీ బహిన్’ పథకం కింద.. వేలాది మంది పురుషులకు అందుతున్న డబ్బులు
Lingayats Of A Maharashtra | శ్మశానవాటిక లేక ఇబ్బందులు.. లింగాయత్‌లు ఏం చేశారంటే?
Farmer Annual Income Rs.3 | దేశంలోనే పేద రైతు.. వార్షిక ఆదాయం రూ.3గా ఇన్కమ్ సర్టిఫికెట్ జారీ
Raj Thackeray Enters Matoshree | 13 ఏళ్ల తర్వాత.. తొలిసారి మాతోశ్రీలోకి అడుగుపెట్టిన రాజ్ ఠాక్రే