ముంబై: శ్మశానవాటిక లేకపోవడంతో లింగాయత్‌లు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో వినూత్నంగా నిరసన తెలిపారు. ఒక మృతదేహంతో మున్సిపల్ కౌన్సిల్ కార్యాలయం వద్దకు చేరుకుని అక్కడ బైఠాయించారు. (Lingayats Of A Maharashtra) మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అంబజోగై నగరానికి చెందిన లింగాయత్ కమ్యూనిటీ సభ్యులు చాలా కాలంగా బారాఖంబి ప్రాంతంలోని శ్మశానవాటికపై ఆధారపడ్డారు. అయితే ఆ పవిత్ర స్థలాన్ని పురావస్తు శాఖ ఆక్రమించిందని వారు ఆరోపించారు. దీంతో తమ వర్గంలో మరణించిన వారికి అంత్యక్రియలు నిర్వహించడానికి తగిన స్థలం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. లింగాయత్‌ల కోసం శ్మశానవాటికను ఏర్పాటు చేయాలని కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు.
కాగా, బీజేపీ ఎమ్మెల్యే నమిత ముందాడ ప్రాతినిధ్యం వహిస్తున్న అంబజోగైకు చెందిన లింగాయత్‌లు ఆదివారం తమ అసంతృప్తిని తీవ్రం చేశారు. ఒక మృతదేహంతో స్థానిక మున్సిపల్ కౌన్సిల్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. వందలాది లింగాయత్ కమ్యూనిటీ సభ్యులు అక్కడ బైఠాయించి నిరసన తెలిపారు. తమ వర్గం కోసం తక్షణం శ్మశానవాటికను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్లకార్డులు, నినాదాలతో తమ నిరసన తెలియజేశారు.
Also Read:
Raj Thackeray Enters Matoshree | 13 ఏళ్ల తర్వాత.. తొలిసారి మాతోశ్రీలోకి అడుగుపెట్టిన రాజ్ ఠాక్రే
Rave Party Raid | రేవ్ పార్టీపై పోలీసులు రైడ్.. మాజీ మంత్రి అల్లుడుతో పాటు పలువురు అరెస్ట్
Farmer Annual Income Rs.3 | దేశంలోనే పేద రైతు.. వార్షిక ఆదాయం రూ.3గా ఇన్కమ్ సర్టిఫికెట్ జారీ