Varun Sandesh | హ్యాపీడేస్, కొత్త బంగారు లోకం సినిమాలతో కెరీర్ తొలినాళ్లలో మంచి హిట్స్ అందుకున్నాడు టాలీవుడ్ యువ హీరో వరుణ్ సందేశ్ (Varun Sandesh). అయితే ఆ తర్వాత సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న వరుణ్ సందేశ్ గతేడాది నింద సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ మూవీ తర్వాత మరో కొత్త ప్రాజెక్టును లాంచ్ చేశాడు.
వరుణ్ సందేశ్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘వన్ వే టికెట్’ నేడు ఘనంగా లాంచ్ అయింది. ఈ సందర్భంగా వరుణ్ సందేశ్ మాట్లాడుతూ.. వన్ వే టికెట్ టైటిల్ విన్న వెంటనే తనకు కొత్తగా అనిపించిందని అన్నాడు. పళని చెప్పిన కథ నాకు నచ్చింది.. చాలా డిఫరెంట్‌గా ఉండే ఈ స్క్రిప్ట్‌లో నేను కొత్త పాత్ర పోషించబోతున్నా. త్వరలోనే షూటింగ్ మొదలవుతుందని చెప్పాడు.
శ్రీ పద్మ ఫిల్మ్స్, రంగస్థలం మూవీ మేకర్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ మూవీని జొరిగే శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. ఏ పళని స్వామి దర్శకత్వం ఈ చిత్రంలో కుష్బూ చౌదరి హీరోయిన్గా నటిస్తోంది. మనోజ్ నందన్, సుధాకర్ కీలక పాత్రల్ని పోషిస్తున్నారు.
ఈ మూవీ ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొన్న ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా.. మరో నిర్మాత హర్షిత్ రెడ్డి స్క్రిప్ట్ అందజేశారు. దర్శక, నిర్మాత త్రినాథరావు నక్కిన తొలి సన్నివేశానికి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ మూవీకి శ్రీనివాస్ బెజుగమ్ కెమెరామెన్ కాగా.. మ్యూజిక్ డైరెక్టర్‌గా కార్తీక్ పని చేస్తున్నారు. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ఇతర విషయాల్ని ప్రకటించనున్నారు.
A new journey begins! 🎉 #VarunSandesh ‘s #OneWayTicket officially launched today with a grand pooja ceremony
We’re thrilled to announce the film kicked off with Producer #CKalyan giving the clap, director @TrinadharaoNak1 switching on the camera, and Producer #HarshithReddy… pic.twitter.com/DyVKXxXwjf
— BA Raju’s Team (@baraju_SuperHit) July 27, 2025
Saanve Megghana | నటి శాన్వీ మేఘన ఇంట్లో వరలక్ష్మీ వ్రతం వేడుక!.. ‘హారతి తీసుకోండంటూ’ పోస్ట్
Constable Kanakam | ఓటీటీలోకి ‘కానిస్టేబుల్ కనకం’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.!
Shobha Shetty | హీరో సుదీప్తో బిగ్ బాస్ బ్యూటీకి గొడవ ఏంటి.. క్లారిటీ ఇచ్చిన శోభా శెట్టి