Saanve Megghana | తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నటి శాన్వీ మేఘన తన ఇంట్లో వరలక్ష్మీ వ్రతం వేడుకను ఘనంగా నిర్వహించుకుంది. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు జరుపుకునే ఈ పండుగను శాన్వీ తన కుటుంబ సభ్యులతో కలిసి ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించింది.
వరలక్ష్మీ వ్రతం సందర్భంగా తన ఇంట్లో అలంకరించిన అమ్మవారి మండపం, పూజా కార్యక్రమాలకు సంబంధించిన అందమైన ఫొటోలను శాన్వీ తన ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు ఎక్స్‌లో పంచుకుంది. ముఖ్యంగా, పూజానంతరం ఫొటోలను షేర్ చేస్తూ, “అందరూ హారతి తీసుకోండి” అని క్యాప్షన్ ఇచ్చారు. శాన్వీ పోస్ట్ చేసిన ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె అభిమానులు, నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్లు పెడుతున్నారు.
శాన్వీ మేఘన తెలుగులో పిట్టకథలు, పుష్పక విమానం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల తమిళంలో వచ్చిన కుడుంబస్తాన్ సినిమాలో కథానాయికగా నటించి అందరిని మెప్పించింది.
Vara Lakshmi Vratam – Hyderabad! ♥️
Instagram lo Harathi teeskondi. 😋 pic.twitter.com/qafrhz11HV— Saanve Megghana (@SaanveMegghana) July 27, 2025