‘జీవనోపాధులను దెబ్బతీస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు’
ప్రజల జీవనోపాధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దెబ్బతిస్తున్నాయని సిపిఐ రామన్నపేట మండల కార్యదర్శి ఉట్కూరు నరసింహ అన్నారు. రామన్నపేటలోని సుభాష్ సెంటర్ వద్ద సిపిఐ కేంద్ర, రాష్ట్ర పార్టీల పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రపంచ వ్యాప్తంగా..
రామన్నపేట, మార్చి 17 : ప్రజల జీవనోపాధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దెబ్బతిస్తున్నాయని సిపిఐ రామన్నపేట మండల కార్యదర్శి ఉట్కూరు నరసింహ అన్నారు. రామన్నపేటలోని సుభాష్ సెంటర్ వద్ద సిపిఐ కేంద్ర, రాష్ట్ర పార్టీల పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రపంచ వ్యాప్తంగా అమెరికా సామ్రాజ్యవాద మొండి నిర్ణయాలకు వ్యతిరేకంగా ముందస్తు నిర్ణయాలు తీసుకోకుండా దేశ ప్రజలను అయోమయంలోకి నెట్టి గ్యాస్ ఇతర నిత్యావసర ధరలు పెంచడాన్ని నిరసిస్తూ మంగళవారం సుభాష్ సెంటర్లో నిరసన కార్యక్రమం చేపట్టారు. యుద్ధ వాతావరణం ఏర్పడినప్పుడు ఎగుమతులు, దిగుమతుల విషయంలో దేశానికి అవసరమైన పెట్రోల్, డీజిల్, గ్యాస్ దిగుమతులను ముందస్తుగానే గుర్తించి తగిన నిల్వలను ఏర్పాటు చేయకుండా దేశ వ్యాప్తంగా ప్రజల జీవనోపాధులు దెబ్బ తినే విధంగా చేశారన్నారు. గ్యాస్ కొరతను ముందస్తుగా గుర్తించకుండా కాలయాపన చేసి నిర్లక్ష్యంతో ప్రజలకు నానా ఇబ్బందులు సృష్టించారని దుయ్యబట్టారు.
అమెరికా ఇరాన్ పై చేస్తున్న దాడిని ఖండించి శాంతి వాతావరణం నెలకొనేలా చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకుడు ఎర్ర రమేష్ గౌడ్, సిపిఐ మండల సహాయ కార్యదర్శి కళ్లెం రామచంద్రం, పట్టణ కార్యదర్శి రచ్చ యాదగిరి, శివరాత్రి సమ్మయ్య, బాలగోని మల్లయ్య, ఊట్కూరి భగవంత, గంగాపురం వెంకటయ్య, వీరమల్ల ముత్తయ్య, గంగాపురం యాదయ్య, పల్లె మల్లేశం, పర్స సుదర్శన్, ఊట్కూరు కృష్ణ, ఊట్కూరు శీను, పెండెం రవీందర్, ఏనూతుల రమేశ్, కడమంచి జగన్నాథం, వీసం గాలయ్య, ఊట్కూరు శంకర్, జెల్లా అంబయ్య, శ్రావణ్, ఊట్కూరు శంకర్ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Manne Krishank | ఒకటి కాదు మూడు ఆధారాలు చూపిస్తా.. మెడికవర్ ఆసుపత్రి షేర్లపై రేవంత్‌రెడ్డికి క్రిశాంక్ సవాల్!
Punjagutta Temple: పంజాగుట్ట దుర్గాభవానీ గుడిలో సరస్వతీ దేవి అలంకారములో అమ్మవారు
Hyderabad | పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై యాక్సిడెంట్.. ఒకదానికొకటి ఆరు కార్లు ఢీ
Tesla Flying Car: టెస్లా ఫ్లయింగ్ కార్ వచ్చేసింది.. గాలిలో పల్టీలు కొట్టి.. సేఫ్‌గా ల్యాండైన రోడ్‌స్టర్ 2.. వీడియో
Dragon | ‘డ్రాగన్’ షూటింగ్‌కి రీఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

