అనంతగిరి, మార్చి 17 : అనంతగిరి మండలంలోని బొజ్జగూడెం తండాలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన గర్భకోశ నట్టల నివారణ, పశువులకు టీకాల పంపిణీ కార్యక్రమాన్ని సర్పంచ్ గుగులోతు నీలబాయి శ్రీనివాస్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు తమ పశువులకు సీజన్ వారీగా టీకాలు వేయించాలన్నారు. డాక్టర్ సురేంద్ర మాట్లాడుతూ.. పశువుల ఆరోగ్యానికి ప్రభుత్వం అందిస్తున్న టీకాలను, మందులను రైతులు వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ భూక్యా నాగమణి రవి, గ్రామ పెద్దలు దారావతు బలరాం, హుస్సేన్ నాయక్, మాజీ ఉప సర్పంచ్ హరిప్రసాద్, బాలాజీ, దారావతు సైదులు, సూక్య, బాలాజీ, బాబుపంచాలి, తులసిరామ్, సూపర్ వైజర్ సైదులు, గోపాల మిత్రులు, రవీందర్,గోపాల్ రావు, సరిత, ఎల్లేశ్య, శరత్, గ్రామస్తులు పాల్గొన్నారు.