రామగిరి, మార్చి 17 : నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలోని పీజీ విద్యార్థులకు జనవరి 2026లో నిర్వహించిన మూడవ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించిన ఫలితాలను నేడు యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, రిజిస్ట్రార్ డాక్టర్ కొప్పుల అంజి రెడ్డి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ జి.ఉపేందర్ రెడ్డి, పర్సనల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ సంధ్యారాణి, లక్ష్మీప్రభ, ప్రవళిక, కళ్యాణి, భిక్షమయ్య పాల్గొన్నారు. పరీక్షలకు మొత్తం 1,092 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 821 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 24 మంది విద్యార్థులు ప్రమోట్ అయ్యారు. 246 మంది విద్యార్థులు వివిధ సబ్జెక్టుల్లో అణుతీర్ణులయ్యారు. ఒక మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు చేయబడింది.