Varsha Bollamma | మిడిల్ క్లాస్ మెలొడీస్, పుష్పక విమానం, ఊరు పేరు భైరవకోన సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది బెంగళూరు భామ వర్ష బొల్లమ్మ (Varsha Bollamma). ప్రస్తుతం ఆమె టైటిల్ రోల్లో నటిస్తోన్న తాజా చిత్రం కానిస్టేబుల్ కనకం (Constable Kanakam). ఈ సినిమాకు ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహిస్తుండగా.. ఈటీవీ ఒరిజినల్స్ నుంచి రాబోతున్న ఈ చిత్రాన్ని కోవెలమూడి సాయిబాబా, వేమూరి హేమంత్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు. రాజీవ్ కనకాల, మేఘలేఖ, అవసరాల శ్రీనివాస్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తాజాగా విడుదల తేదీని పంచుకుంది. ఈ సినిమాను ఆగష్టు 14న ఈటీవీ విన్ వేదికగా విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. అదొక మారుమూల గ్రామం. సాధారణంగా ప్రశాంతంగా ఉండే ఆ ఊరిలో వరుసగా అమ్మాయిలు అదృశ్యమవుతుంటారు. అయితే ఈ కేసును పరిష్కరించడానికి రంగంలోకి దిగుతుంది కానిస్టేబుల్ కనకమహాలక్ష్మి. మరి ఆమె ఈ మిస్టరీని ఎలా ఛేదించిందో తెలుసుకోవాలంటే ‘కానిస్టేబుల్ కనకం’ వెబ్‌సిరీస్ చూడాల్సిందే.
Not your regular cop.
Not your regular case.
Constable Kanakam is all set to shake things up! 😎#adhijinkakadu
🔥 A Win Original Series
👉 Only on @etvwin
Premieres AUG 14
First Episode Free @VarshaBollamma @RajeevCo
Written & Directed by : @dimmalaprasanth
🎥… pic.twitter.com/pk1KOSaakb— ETV Win (@etvwin) July 26, 2025