Manjeera River | పాపన్నపేట, జులై 27 : చేపల వేట కోసం స్నేహితులతో కలిసి వెళ్ళిన యువకుడు మంజీర నదిలో గల్లంతైన సంఘటన మండల పరిధిలోని ముద్దావూర్ బ్రిడ్జి వద్ద ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. పాపన్నపేట ఏఎస్ఐ తుక్కయ్య కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని బాచారం గ్రామానికి చెందిన శాయిబాజ్ (25) మెదక్‌లోని ఆర్టీఏ బ్రోకర్‌గా పని చేస్తున్నాడు. ఆదివారం ఆరుగురు స్నేహితులతో కలిసి ముద్దాపూర్ బ్రిడ్జి వద్దకు వెళ్ళాడు. అక్కడ చేవలు పట్టే క్రమంలో మంజీర ప్రవాహం ఎక్కువగా ఉండటంతో నీటిలో కొట్టుకు పోయాడు. కాగా సాయంత్రం వరకు అతని అచూకీ దొరకలేదు. శాయిబాజ్ కి పెళ్ళి కాగా, పిల్లలు లేరు. మృతుని కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ వివరించారు.