పాత పద్ధతిలోనే యూరియా ఇవ్వాలి
‘యూరియా బుకింగ్ యాప్‌తో ఆగమవుతున్నాం.. పాత పద్ధతిలోనే యూరియా ఇవ్వండి’ అంటూ కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్‌లో జాతీయ రహదారిపై రైతులు రా స్తారోకోకు దిగారు. తాడికల్ సింగిల్ విండో గోదాంకు బుధవారం సాయంత్రం 230 యూరియా బస్తాలు సరఫరా అయినట్టు రైతులు తెలుసుకుని గురువారం ఉదయం తాడికల్ సింగిల్‌విండో గోదాముకు తరలివెళ్లారు.
- తాడికల్ జాతీయ రహదారిపై రైతుల రాస్తారోకో
- రైతులకు ధర్నాకు బీఆర్ఎస్ నాయకుల సంఘీభావం
శంకరపట్నం, ఫిబ్రవరి 12 : ‘యూరియా బుకింగ్ యాప్‌తో ఆగమవుతున్నాం.. పాత పద్ధతిలోనే యూరియా ఇవ్వండి’ అంటూ కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్‌లో జాతీయ రహదారిపై రైతులు రా స్తారోకోకు దిగారు. తాడికల్ సింగిల్ విండో గోదాంకు బుధవారం సాయంత్రం 230 యూరియా బస్తాలు సరఫరా అయినట్టు రైతులు తెలుసుకుని గురువారం ఉదయం తాడికల్ సింగిల్‌విండో గోదాముకు తరలివెళ్లారు.
అప్పటికే యూరియా స్టాక్ అయిపోయినట్టు యాప్‌లో కనిపించడంతో రైతులు అసహనానికి గురయ్యారు. యూరియా బస్తాలు క్షణాల్లో అయిపోవడంపై కన్నెర్ర జేశారు. యూరియాలోటు, యాప్ బుకింగ్ సిస్టమ్‌తో విసిగిపోయిన రైతులు గోదాం నుంచి నేరుగా జాతీయ రహదారిపైకి వచ్చి రాస్తారోకోకు దిగారు. యాప్ విధానంతో చదువురాని, ఆండ్రాయిడ్ ఫోన్లు లేని, ఆపరేటింగ్ రాని రైతులు అరిగోస పడుతున్నారని పేర్కొన్నారు. వరి పైర్లు కీలక దశలో ఉన్న సమయంలో యూరియా అందక పంట దిగుబడి కోల్పోయే పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తంచేశారు.
ప్రభుత్వం కొత్తగా తెచ్చిన యాప్ విధానంతో ఈ సమస్య తలెత్తిందని ఆరోపించారు. దీనిని తొలగించి రైతులకు సరిపడా యూరియా బస్తాలు అందుబాటులో ఉంచి, పాత పద్ధతిలో సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు గంట మహిపాల్ రైతులకు సంఘీభావంగా కార్యకర్తలతో కలిసి రాస్తారోకోలో పాల్గొన్నారు. రోడ్డుకిరువైపులా ట్రాఫిక్ స్తంభించడంతో పోలీసులు వచ్చి రైతులకు నచ్చజెప్పి పరిస్థితిని సద్దుమణిగేలా చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS | గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ ఇన్చార్జుల నియామకం
Shamonda Virus | తొలిసారిగా మనిషికి సోకిన షమోండా వైరస్
Nominated Posts | కోటరీకే నామినేటెడ్ కిరీటం.. 50కి పైగా నామినేటెడ్ పోస్టుల భర్తీకి రేవంత్, మహేశ్‌గౌడ్ కసరత్తు
Farmers | 20 లక్షల ఎకరాల్లో ఎండిన పంటలు.. అయినా రైతుకు పలకరింపేది?
Jio IPO | జియో ఐపీవోకు యమ క్రేజ్.. 5.57 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

