రాయపోల్, జులై 27 : రాయపోల్ మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామ రెడ్డి సంఘం ఆధ్వర్యంలో నల్ల పోచమ్మ విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రెడ్డి జాగృతి వ్యవస్థాపక అధ్యక్షులు బుట్టెం గారి మాధవరెడ్డి పాల్గొని అమ్మవారిని దర్శించుకోని మొక్కులు చెల్లించుకున్నారు. రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాగా కొత్తపల్లి రెడ్డి సంఘం వారు శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా బుట్టెంగారి మాధవరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఎంతో ఉందన్నారు. కొత్తపల్లి గ్రామంలో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో నల్ల పోచమ్మ విగ్రహ ప్రతిష్ట చేయడం పట్ల అభినందించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి బాగా పంటలు పండాలని, ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో రెడ్డి జాగృతి సిద్దిపేట జిల్లా యూత్ అధ్యక్షులు ఇలిటం నితీష్ రెడ్డి, రెడ్డి జాగృతి సిద్దిపేట జిల్లా కార్యదర్శి రవీందర్ రెడ్డి, గజ్వేల్ నియోజకవర్గం రెడ్డి జాగృతి ఇంచార్జ్ మేదిని బాలకృష్ణారెడ్డి తదితరులు పాల్గొని అమ్మవారిని దర్శించుకోని మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామస్తులు నల్ల పోచమ్మ అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.