Deepti Sharma : ఇంగ్లండ్ పర్యటనలో దీప్తి శర్మ (Deepti Sharma) అదరగొడుతోంది. బంతితో వికెట్ల వేట కొనసాగిస్తూనే.. బ్యాటుతో ఆపద్భాందవురాలి పాత్ర పోషిస్తోంది. వన్డే సిరీస్ ఆరంభ మ్యాచ్‌లో ఈ స్టార్ ఆల్‌రౌండర్ అర్ధ శతకంతో టీమిండియాను గెలిపించింది. భారీ ఛేదనలో ఖతర్నాక్ ఇన్నింగ్స్ ఆడిన దీప్తి.. ఒంటిచేత్తో సిక్సర్ కొట్టి అబ్బురపరిచింది. ఆమె అలా సింగిల్ హ్యాండ్‌తో బంతిని స్టాండ్స్‌లోకి పంపడం చేసి వావ్.. ఇలాంటి షాట్ కూడా ఆడగలదా? అని సహచరులు, ప్రత్యర్థులు సైతం ఆశ్చర్యపోయారు.
బుధవారం జరిగిన తొలి వన్డేలో సూపర్ హాఫ్ సెంచరీతో జట్టును గెలిపించింది దీప్తి. అజేయ అర్ధ శతకంతో చెలరేగిన ఆమె లారెన్ బెల్ బౌలింగ్‌లో మిడ్ వికెట్ దిశగా ఒంటి చేత్తో కొట్టిన సిక్సర్ మ్యాచ్‌కే హైలెట్. మ్యాచ్ అనంతరం ఈ షాట్ గురించి మాట్లాడుతూ.. తన సింగిల్ రిషభ్ పంత్‌ను చూసి నేర్చుకున్నానని చెప్పింది డీఎస్పీ.
Deepti Sharma’s new shot is straight out of the Rishabh Pant playbook 👀 pic.twitter.com/BMOYgrtBND
— ESPNcricinfo (@ESPNcricinfo) July 17, 2025
‘పంత్ ఒంటిచేత్తో బంతిని స్టాండ్స్లోపి పంపడం చూసి ముచ్చేటేసేది. అతడిని చేసి స్ఫూర్తి పొందిన నేను ఒంటిచేత్తే సిక్సర్ కొట్టాలనుకున్నా. అయితే.. కొంచెం కష్టమైన షాట్ అది. అయినా సరే నెట్స్‌లో సాధన చేసి పట్టు సాధించాను. మ్యాచ్‌లో ఒక్కటైనా సింగిల్ హ్యాండెడ్ షాట్ ఆడాలని టైమ్ కోసం ఎదురుచూశాను. అచ్చం పంత్ మాదిరిగానే తొలి వన్డేలో బెల్ ఓవర్లో ఒంటిచేత్తో బంతిని సిక్సర్‌గా మలిచాను’ అని దీప్తి వెల్లడించింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 259 పరుగుల ఛేదనలో కీలక ఇన్నింగ్స్ ఆడిన దీప్తి(62 నాటౌట్)కి జెమీమా రోడ్రిగ్స్(48) చక్కని సహకారం అందించింది. ఈ జోడీ ఐదో వికెట్‌కు 90 రన్స్ రాబట్టగా.. భారత్ అద్భుత విజయంతో మూడు వన్డేల సిరీస్‌లో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.