ఓసీడీ.. ఒకటికి పదిసార్లు
ఇంటి నుంచి బయటికి వెళ్లేటప్పుడు.. ‘తాళం వేశానా.. లేదా?’ అని తిరిగి వచ్చిమరీ తనిఖీ చేస్తుంటారు. గ్యాస్ ఆన్/ఆఫ్ చేసిందీ.. లేనిదీ చెక్ చేస్తుంటారు. ఇలా తనిఖీ చేసుకోవడం సాధారణ విషయమే! కానీ, అదే పనిని ఒకటికి పదిసార్లు చేస్తూ ఉంటే.. అది ‘అబ్సెసివ్-కంపల్సివ్ డిజార్డర్ (ఓసీడీ)’ అనే మానసిక సమస్యకు సంకేతమట.
ఇంటి నుంచి బయటికి వెళ్లేటప్పుడు.. ‘తాళం వేశానా.. లేదా?’ అని తిరిగి వచ్చిమరీ తనిఖీ చేస్తుంటారు. గ్యాస్ ఆన్/ఆఫ్ చేసిందీ.. లేనిదీ చెక్ చేస్తుంటారు. ఇలా తనిఖీ చేసుకోవడం సాధారణ విషయమే! కానీ, అదే పనిని ఒకటికి పదిసార్లు చేస్తూ ఉంటే.. అది ‘అబ్సెసివ్-కంపల్సివ్ డిజార్డర్ (ఓసీడీ)’ అనే మానసిక సమస్యకు సంకేతమట. ఈ సమస్యను చాలామంది తేలిగ్గా తీసుకుంటున్నా.. దైనందిన జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.
అవాంఛిత ఆలోచనలు, అవి సృష్టించే ఆందోళనను తగ్గించడానికే మెదడు ఇలా ప్రవర్తిస్తుందని నిపుణులు చెబుతున్నారు. మెదడులోని న్యూరోట్రాన్స్మిటర్లలో అసమతుల్యత, తీవ్రమైన ఒత్తిడి.. ఇలా ఇందుకు కారణాలు అనేకం. కుటుంబంలో ఎవరికైనా ఓసీడీ ఉంటే.. ఈ సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓసీడీకి గురైనవారి ప్రవర్తన కాస్త విచిత్రంగా అనిపిస్తుంది. దేన్ని ముట్టుకున్నా.. చేతులకు మురికి, క్రిములు అంటుకున్నాయని భయపడుతుంటారు.
వస్తువులు నిర్దిష్ట పద్ధతిలోనే ఉండాలని పట్టుబడుతుంటారు. తనవల్ల ఎవరికైనా హాని కలుగుతుందేమోనని కంగారు పడుతుంటారు. దీనికి శాస్త్రీయమైన చికిత్స ఉన్నదని నిపుణులు చెబుతున్నారు. ‘ఎక్స్పోజర్ అండ్ రెస్పాన్స్ ప్రివెన్షన్’ (ఈఆర్పీ) కాగ్నిటివ్-బిహేవియరల్ థెరపీతో.. ఈ సమస్యకు చెక్ పడుతుందని అంటున్నారు.
భయపడే పరిస్థితులను ఎదుర్కోవడానికి, మళ్లీమళ్లీ చేస్తున్న పనులను నియంత్రించడంలో సహాయపడుతుంది. నిత్యం వ్యాయామం, తగినంత నిద్ర, ఆరోగ్యకరమైన ఆహారం.. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. యోగా, ధ్యానం, శ్వాస వ్యాయామాలు ఆందోళనను తగ్గిస్తాయి. క్రమంగా ఓసీడీ లక్షణాలు తగ్గుముఖం పడుతాయి. లక్షణాలు తీవ్రంగా ఉంటేమాత్రం నిపుణుల సహాయం తప్పనిసరి.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

