ఎదులాపురం,(బేల)ఫిబ్రవరి 27: రైతులు రసాయన ఎరువుల వాడకం తగ్గించి సేంద్రియ వ్యవసాయంపై దృష్టిపెట్టాలని ఆదిలాబాద్ జిల్లా ఉద్యానవన శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ నర్సయ్య సూచించారు. ఆదిలాబాద్ మండలంలోని మాంగృడ్ గ్రామంలో సీపీఎఫ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం జీవామృత కేంద్రాన్ని జిల్లా ఉద్యానవన శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ నర్సయ్య మండల అధికారులు, ఏరువాక శాస్త్రవేత్తలతో కలిసి ప్రారంభించారు. రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రి య ఎరువుల వాడకంపై రైతులకు అవగాహన కల్పించారు. సేంద్రియ ఎరువులతో పండించిన ఆహార పదార్థాల స్టాళ్ల ను ఏర్పాటు చేసి అందులో లభించే పోషకాలపై వివరించారు. జిల్లా ఉద్యానవన శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ నర్సయ్య, సీపీఎఫ్ స్వచ్ఛంద సంస్థ ప్రోగ్రాం అధికారి సత్యనారాయణ మాట్లాడుతూ..రైతులు రసాయనిక ఎరువులు విచ్చలవిడిగా వాడకంతో భూమి సారవంతం తగ్గిపోవడమే కాకుండా ఖర్చులు కూడా పెరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రఘునాథ్ రావు, మండల వ్యవసాయ శాఖ అధికారి సాయి తేజ రెడ్డి, ఎంపీడీవో ఆంజనేయులు, గ్రామ సర్పంచ్ తేకం పూజ, ఏఈవో ఉమర్, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.