BRS Party | పీర్జాదిగూడ, జూలై 17 : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 3వ డివిజన్ పరిధిలోని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన సుమారు 20 మంది నాయకులు వెంకట్ ఆధ్వర్యంలో మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ దొంతిరి హరిశంకర్ రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి రఘువర్ధన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
పార్టీలో చేరిన వారికి స్థానిక పార్టీ కార్యాలయంలో మాజీ మేయర్ వెంకట్ రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సాయిప్రియ నగర్ కాలనీ బీజేపీ నాయకులు అమర్ పటేల్‌తోపాటు నాగరాజు రావు, ప్రశాంత్, మహేష్, ఆంజనేయులు పటేల్, సంతోష్, లక్ష్మారెడ్డి, అబ్దుల్, భాస్కర్, శంకర్, అశోక్, రవికాంత్, సునీల్, రామిరెడ్డి, గౌస్ భాయ్, కిషోర్, టింకు, శామ్యూల్, జోసెఫ్, రవితోపాటు తదితరులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఏనుగు మనోరంజన్ రెడ్డి, మహిళా విభాగం అధ్యక్షురాలు నిర్మల, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
Siddipeta | రైతుల గోస రేవంత్ రెడ్డికి వినబడట్లేదా..? : జీడిపల్లి రాంరెడ్డి
Oil Palm | ఆయిల్ పామ్ తోటల సాగుతో అధిక లాభాలు..
Medak | కల్లు.. కల్లు.. కల్లమ్మ కల్లు.. కొత్త పుంతలు తొక్కుతున్న కల్తీకల్లు వ్యాపారం