Cyber Criminals | మేడ్చల్, జూలై 17 : అప్రమత్తతతో సైబర్ నేరాల నివారణ సాధ్యమవుతుందని అంతర్జాతీయ సైబర్ నేర శిక్షకుడు అఖిలేష్ రావు అన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడలోని సేయింట్ పీటర్స్ ఇంజినీరింగ్ కళాశాలలో గురువారం సైబర్ భద్రత, నేరాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవలి కాలంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోయాయన్నారు.
సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త దారుల్లో సామాన్యులనే కాదు ఉన్నత విద్యావంతులను సైతం బురిడీ కొట్టిస్తూ వేల కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారన్నారు. సైబర్ నేరగాళ్ల పన్నాగాలను తిప్పికొట్టాలంటే అప్రమత్తత అవసరమన్నారు. ప్రతీ ఒక్కరికి సైబర్ నేరాలపై అవగాహన అత్యావశ్యకమైన పరిస్థితులు నెలకొన్నాయని ఆయన చెప్పారు.
ఈ సందర్భంగా సైబర్ ప్రపంచంలో ఉద్భవిస్తున్న ధోరణులు, సవాళ్లు, నివారణ వ్యూహాలపై ఆయన అవగాహన కల్పించారు. అలాగే సైబర్ భద్రతా కెరీర్లు, పరిశ్రమ అవసరాలు, ఎథికల్ హ్యాకింగ్ అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి టీవీ రెడ్డి, ప్రిన్సిపాల్ చంద్రశేఖర్ రెడ్డి, సీఎస్ఈ హెచ్వోడీ అర్చన, డైరెక్టర్లు సరోజా రెడ్డి, అనురాగ్ రెడ్డి , పీఆర్వో రవి సుధాకర్ పాల్గొన్నారు.
Siddipeta | రైతుల గోస రేవంత్ రెడ్డికి వినబడట్లేదా..? : జీడిపల్లి రాంరెడ్డి
Oil Palm | ఆయిల్ పామ్ తోటల సాగుతో అధిక లాభాలు..
Medak | కల్లు.. కల్లు.. కల్లమ్మ కల్లు.. కొత్త పుంతలు తొక్కుతున్న కల్తీకల్లు వ్యాపారం