హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 26: నిట్లోఆర్గానిక్ సింథసిస్ అండ్ అడ్వాన్స్డ్ మెటీరియల్స్ పై మూడు రోజుల సదస్సు అనుసంధాన్ జాతీయ పరిశోధన సంస్థ సహకారంతో గురువారం ప్రారంభమైంది. కెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సదస్సులో ఇంటర్ డిసిప్లినరీ సహకారం శాస్త్రీయ మార్పిడిని ప్రోత్సాహించడాన్ని లక్ష్యంగా పెట్టుకుందని నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుధిఒ తెలిపారు. ముఖ్య అతిథిగా బెంగళూరులోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ప్రొఫెసర్ ఎన్ జయరామన్, స్టూడెంట్ వెల్ఫేర్ డీన్ ప్రొఫెసర్ కె.కిరణ్‌కుమార్ సమావేశాన్ని ప్రారంభించి, కాన్ఫరెన్స్ సావనీర్‌ను విడుదల చేశారు.
కెమిస్ట్రీ విభాగాధిపతి ప్రొఫెసర్ సంతోష్ అధ్యక్షత వహించారు. ఫార్మాస్యూటికల్ డ్రగ్స్, సైట్-డైరెక్ట్ డెలివరీ సిస్టమ్స్, ఫంక్షనల్ ఆర్గానిక్ మెటీరియల్స్, నానోమెటీరియల్స్, ఆర్గానోమెటాలిక్స్, సూపర్మోలిక్యులర్ కెమిస్ట్రీ, ఆప్టిక్స్, ఎనర్జీ మెటీరియల్స్, కాటాలిసిస్, ఫోటోకెమిస్ట్రీ గ్రీన్ అండ్ సస్టైనబుల్ కెమిస్ట్రీ వంటి అంశాలను ఇందులో ప్రధానంగా చర్చించారు. ఈ సమావేశంలో ప్రొఫెసర్ అమర్ నాథ్ నటరాజన్ (యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాటి, యుఎస్ఎ), ప్రొఫెసర్ లిషెంగ్ వాంగ్ (యూనివర్సిటీ ఆఫ్ ఒట్టావా, కెనడా), ప్రొఫెసర్ జేమ్స్ బ్లేక్ మోర్ (యూనివర్సిటీ ఆఫ్ కాన్సాస్, యుఎస్ఎ) వంటి ప్రముఖ శాస్త్రవేత్తలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ విద్యా, పరిశోధనా సంస్థల నుంచి అనేకమంది ప్రముఖ పరిశోధకులు ఈ సదస్సులో పాల్గొన్నారు.
శాస్త్రీయ మార్పిడి, జ్ఞాన భాగస్వామ్యం, అంతర్-విభాగ సహకారాలను పెంపొందించడానికి ఉత్షాహబరిత వేదికగా నిలుస్తుందని, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 200 మంది ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారని నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుధి తెలిపారు.