Farveez Maharoof | సిరాజ్ కాదు.. భారత జట్టు అస్త్రం ఆ కుర్రాడే..!
Farveez Maharoof : నాలుగు రోజుల్లో గాలేలో మ్యాచ్ ఉండడంతో... లంక బ్యాటర్లను నిలువరించే పేసర్ ఎవరు? అనేది ఆసక్తి రేపుతోంది. ఈ నేపథ్యంలో శ్రీలంక దిగ్గజం పర్వేజ్ మొహరూఫ్(Farveez Maharoof) తమ ఆటగాళ్లకు టీమిండియాలోని పొడగరి పేసర్ నుంచి ముప్పు ఉందని తెలిపాడు.
Farveez Maharoof : వామప్ మ్యాచ్‌లో గెలుపొందిన భారత జట్టు టెస్టు సిరీస్‌కు సిద్ధమవుతోంది. శ్రీలంక ఎలెవన్ బ్యాటర్ల ముందు తేలిపోయిన మన బౌలర్లు ఏ మేరకు రాణిస్తున్నారు? అనేది ప్రశ్నార్థకంగా మారింది. మరో నాలుగు రోజుల్లో గాలేలో మ్యాచ్ ఉండడంతో… లంక బ్యాటర్లను నిలువరించే పేసర్ ఎవరు? అనేది ఆసక్తి రేపుతోంది. ఈ నేపథ్యంలో శ్రీలంక దిగ్గజం పర్వేజ్ మొహరూఫ్(Farveez Maharoof) తమ ఆటగాళ్లకు టీమిండియాలోని పొడగరి పేసర్ నుంచి ముప్పు ఉందని తెలిపాడు. టెస్టు సిరీస్‌లో ఆ కొత్త బౌలరే శుభ్‌మన్ గిల్ సేనకు ప్రధాన అస్త్రం అవుతాడని మహరూఫ్ పేర్కొన్నాడు.
టెస్టు సిరీస్‌లో ఓవైపు గాయాలు.. మరోవైపు శ్రీలంక ఎలెవన్‌పై భారీగా పరుగులిచ్చుకున్న బౌలర్లు.. భారత జట్టుకు సవాల్‌గా మారనున్నాయి. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా గైర్హాజరీలో సిరాజ్ నేతృత్వంలోని టీమిండియా బౌలింగ్ దళం ఏమేర రాణిస్తుంది? అనేది చూడాలి. అయితే.. అరంగేట్రం నుంచి ఆకట్టుకుంటున్న గుర్నూర్ బ్రార్ టీమిండియా తరపుముక్క అవుతాడని శ్రీలంక వెటరన్ పర్వేజ్ మహరూఫ్ అన్నాడు.
VIDEO | Former Sri Lanka allrounder Farveez Maharoof (@farveezmaharoof) feels rookie pacer Gurnoor Brar could be the ‘X-Factor’ in absence of Jasprit Bumrah and says he would be tempted to hand the 26-year-old his Test debut in the two-match series against Sri Lanka, beginning in… pic.twitter.com/O3fvrNbO1O
— Press Trust of India (@PTI_News) August 11, 2026
‘పాత బంతితో బుమ్రా రివర్స్ స్వింగ్ రాబట్టగలడు. ఇప్పుడు అతడు దూరమవ్వడం భారత్‌కు ఎదురుదెబ్బే. దాంతో, టీమిండియా వికెట్ తీసే అవకాశాలపై ప్రభావం పడుతుంది. కానీ, సిరాజ్ మంచి బౌలరే. అయితే.. ఈ సిరీస్‌లో ఇండియాకు గుర్నూర్ బ్రార్ కీలకం కానున్నాడు అని నా అభిప్రాయం. అతడు బౌన్స్ రాబట్టగలడు. అతడిలో మంచి పేస్‌తో పాటు కసి కూడా ఉంది. కానీ, అతడు ఇంకా టెస్టులు ఆడలేదు. అయినా సరే .. లంక బ్యాటర్లను గుర్నూర్ ఇబ్బంది పెట్టగలడు. ఇక స్పిన్నర్ల విషయానికొస్తే.. జడేజా, కుల్దీప్.. సుతార్, సరాన్ష్లో ఒకరిని ఆడించే అవకాశముంది’ అని మహరూఫ్ వెల్లడించాడు. ఆగస్టు 15న గాలే స్టేడియంలో ఆతిథ్య లంకను భారత జట్టు ఢీ కొట్టనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

