Electric Officers | వారంలో రెండు రోజులు.. ప్రజల వద్దకే విద్యుత్ అధికారులు
Electric Officers | తమ పరిధిలో పరిష్కరించగల సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని విద్యుత్ శాఖ గజ్వేల్ డీఈ ఎ.స్వామి తెలిపారు. తమ పరిధికి మించిన సమస్యలను ఉన్నతాధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
Electric Officers | రాయపోల్, ఆగస్టు 11: ప్రజా బాట కార్యక్రమంలో భాగంగా విద్యుత్ శాఖ గజ్వేల్ డీఈ ఎ.స్వామి మంగళవారం సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలో పర్యటించారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు వారంలో రెండు రోజులు గ్రామాల్లో పర్యటించాలని నిర్ణయించిన ఆయన, ఏఈ శ్రీనివాసరావుతో కలిసి రాయపోల్ గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలో పర్యటిస్తూ ప్రజల నుంచి విద్యుత్ సరఫరా, స్తంభాలు, లైన్లు తదితర సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా డీఈ స్వామి మాట్లాడుతూ.. తమ పరిధిలో పరిష్కరించగల సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. తమ పరిధికి మించిన సమస్యలను ఉన్నతాధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ప్రజలకు విద్యుత్ సేవల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మాసాన్ పల్లి రాజు, ఉపసర్పంచ్ హమంతు రాజు, విద్యుత్ శాఖ అధికారులు శ్రీనివాస్ రావు, కర్ణాకర్, ప్రవీణ్, ఆంజనేయులు, సత్తయ్య, వార్డు మెంబర్ ప్రభాకర్, నవీన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Read Also :
Chalivagu project | చలివాగు ప్రాజెక్టు ద్వారా రైతులకు సాగు నీరందించాలని బీఆర్ఎస్ ధర్నా
High Alert | ఢిల్లీలో ఉగ్రదాడులు జరుగవచ్చన్న ఇంటెలిజెన్స్.. అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం
Dhanush Fans | కోయంబత్తూరులో భారీ ప్లాన్.. ధనుష్ రాజకీయ అరంగేట్రంపై మళ్లీ మొదలైన చర్చ!
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Obesity | యువతలో భారీగా పెరుగుతున్న ఊబకాయం సమస్య.. హెచ్చరిస్తున్న నిపుణులు..
Nithin | నితిన్ ‘అలియాస్ రుక్మిణి’లో హీరోయిన్ ఎవరంటే.. రుక్మిణి పాత్రను పరిచయం చేసిన చిత్రబృందం!
Air India: బాంబు బెదిరింపు.. ఫ్రాంక్ఫర్ట్ నుంచి వస్తున్న విమానం జైపూర్లో ల్యాండింగ్
Virosh | విజయ్ దేవరకొండ, రష్మికలకు ముందే పెళ్లి చేశాం.. ‘రణబాలి’ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Road accident | కరీంనగర్ జిల్లాలో కారు ఢీ కొని యువకుడి మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

