KTR | పేదలు ఎంతో కష్టపడి కట్టుకున్నఇళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం బుల్డోజర్లతో కూల్చివేస్తున్న సంగతి తెలిసిందే. రేవంత్ సర్కార్ కనికరం లేకుండా ఖమ్మం అర్బన్ వెలుగుమట్ల భూదాన్ భూముల్లో పేదల ఇళ్లను నేలమట్టం చేస్తోంది. ఈ క్రమంలో వారికి అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖమ్మం జిల్లా వెలుగుమట్ల బాధితులను కలిశారు. ఇళ్లు కోల్పోయిన వెలుగు మట్ట బాధితులను కేటీఆర్, పార్టీ నేతలతో కలిసి పరామర్శించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మిమ్మల్ని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు , డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుస్తరు. మీకు అది చేస్తం.. ఇది చేస్తం.. అది చేస్తమని.. మీ 900 కుటుంబాల్లో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తాడు. మీ ఐక్యంగా ఉంటేనే విజయం సాధిస్తరు.. లేదంటే వీళ్లు ఏం చేస్తరు. ఏ 100 మందితో వేలి ముద్రలు తీసుకొని మీకు ఆన్నేన్నో ఇస్తరు.. కేసీఆర్ 2000 డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టించారు. వాటిలో కొన్ని మిగులున్నయట. ఆ ఇండ్లలో కొంతమందికిస్తమని చెప్పి వారిని లాక్కెళతారని కేటీఆర్ హెచ్చరించారు.
ఓపీడీఆర్ వాళ్లు గతంలో ఎప్పుడో చేసిన పని. పాపం వాళ్లేం తప్పు చేయలేదు.. మీకు పట్టాలిప్పించారు. వాళ్లు తప్పు చేసిందేమి లేదు.. ఇప్పుడు వాళ్లను పట్టుకుని ప్రభుత్వం నానా మాటలు అంటోంది. ల్యాండ్ మాఫియానట.. ఎవడమ్మా ల్యాండ్ మాఫియా.. ఎవడైతే ఇవాళ మీ చుట్టూ వందల ఎకరాలు కొన్నాడో.. ఎవడైతే పేదవాడి ఇల్లు కట్టుకున్నడో వాడు మాఫియానా..? మీకు జరిగిన కష్టం.. మీ ఏడుపులు రాష్ట్రం మొత్తం చూసింది. మీ పిల్లలు, మీరు పడుతున్న అవస్థలు చూసే కేసీఆర్ సార్ మమ్మల్ని పంపించారు. దయచేసి ధైర్యంగా ఉండండి.. మీకు అన్ని రకాలుగా అండగా అజయ్ అన్న, మా ఎంపీ గాయత్రి రవిచంద్ర ఉంటారన్నారు.
మంత్రులంతా మంచోళ్లు.. ఆర్డీవో మంచోడు కాదని..
నిన్ననే మేమిక్కడకు రావలే. కానీ పోలీసులను పెట్టి.. అధికారులను పెట్టి ఆటంకాలను కల్పించి.. ఇయ్యాళ్ల మేమిక్కడికి వస్తుంటే మిమ్మల్ని రానీయకుండా చేసిన్రు. మిమ్మల్ని బంధిస్తే గోడలు దూకి వచ్చినోళ్లు ఉన్నరు. మేం వస్తే మీరిక్కడికి రాకూడదు. అంత భయమేంది.. నేనొక్కటే మాట అడుగుతున్నా. ప్రభుత్వం తప్పు చేయకపోతే ముగ్గురు మంత్రులను రమ్మనండి ఇక్కడికి.. తప్పు జరుగకపోతే కలెక్టర్ రావాలె, మంత్రులు రావాలె.. మీది తప్పయితే వాళ్లొచ్చి చెప్పొచ్చు కదా.. ఎందుకు ధైర్యం లేదు. ఎందుకు రావట్లేదు.. వాళ్లు తప్పు చేశారు. నిన్న, మొన్న ఆర్డీవోతో ఇళ్లు కూలగొట్టిచ్చారు.. ఇప్పుడటా మంత్రులంతా మంచోళ్లు.. ఆర్డీవో మంచోడు కాదని బదిలీ చేశారు. అంటే ఒకడిని బలిపశువును చేశారు. ఏ తప్పూ జరుగకపోతే ఆర్డీవోను ఎందుకు వెంటనే బదిలీ చేశారు. సమాధానం చెప్పాలే ప్రభుత్వం. మంత్రులు తప్పు చేయకపోతే.. నిజంగా ధైర్యముంటే వాళ్లెందుకు రావడం లేదు.. ఇక్కడికి.. వాళ్లొచ్చి మాట్లాడాలి కదా.. అందుకే మీరు ధైర్యంగా ఉండండి. మీ వెంబడి కేసీఆర్ అన్న ఉన్నడు.. కేటీఆర్ అన్న ఉన్నడు. మేమంతా ఉన్నం. ఎట్టి పరిస్థితుల్లో మీకు న్యాయం జరిగేదాకా మేము అండగా ఉంటామని హామీనిచ్చారు.
కోర్టుకు పోదాం..
మీకు అన్ని కాగితాలున్నాయి.. కోర్టుకు పోదాం.. కోర్టుకు కూడా మీరు రూపాయి ఖర్చు పెట్టుకునే పని లేదు. పార్టీ తరపున మేం కొట్లాడుతాం.. మీకు మేం అండగా ఉంటాం. మళ్లీ వస్తాం మిమ్మల్ని కాపాడుకుంటాం. న్యాయపరంగా పట్టాలిప్పించే ప్రయత్నం చేస్తాం. దయచేసి ఐకమత్యాన్ని కోల్పోకండి.. సంఘటితంగా, ఒక్కటిగా ఉండండిని సూచించారు.
రెండున్నరేండ్లలో రాష్ట్రవ్యాప్తంగా
వేలాది పేదల ఇండ్లు కూలగొట్టింది కాంగ్రెస్ సర్కార్.ఇందిరమ్మ రాజ్యం అంటే ఇండ్లు కూలగొట్టడమేనా?
ఇదే వెలుగుమట్లలో
మీకు ఇండ్లు కట్టించే బాధ్యత మాది!– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ pic.twitter.com/HXjtHxpqnv
— BRS Party (@BRSparty) February 26, 2026
Virosh Wedding | ఒక్కటైన విరోష్: రాజస్థాన్లో వైభవంగా విజయ్-రష్మిక వివాహం!
Tirumala | తిరుమల ఘాట్ రోడ్డుపై ప్రమాదం.. ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు
Bhu Bharati | భూ భారతిలో రెవెన్యూ సదస్సు అప్లికేషన్లు మాయం