‘కోపా అమెరికా’ విజేత అర్జెంటీనా
కోపా అమెరికా| ప్రతిష్టాత్మక కోపా అమెరికా పుట్‌బాల్ టోర్నీని అర్జెంటీనా సొంతం చేసుకున్నది. మారకానా స్టేడియంలో హోరాహోరీగా జరిగిన ఫైనల్లో 1-0 తేడాతో బ్రెజిల్‌పై విజయం సాధించింది. అర్జెంటీనా ఆటగాడు ఏజెల్ డీ మారియా గోల్ చేసి తన జట్టుకు అపురూపమైన విజయాన్ని సాధించిపెట్టాడు. దీంతో 28 ఏండ్ల తర్వాత కోపా అమెరికా టోర్నీని అర్జెంటీనా కైవసం చేసుకున్నది.

వాషింగ్టన్: ప్రతిష్టాత్మక కోపా అమెరికా ఫుట్‌బాల్ టోర్నీని అర్జెంటీనా సొంతం చేసుకున్నది. రియోలోని మారకానా స్టేడియంలో హోరాహోరీగా జరిగిన ఫైనల్లో 1-0 తేడాతో బ్రెజిల్‌పై విజయం సాధించింది. అర్జెంటీనా ఆటగాడు ఏజెల్ డీ మారియా గోల్ చేసి తన జట్టుకు అపురూపమైన విజయాన్ని సాధించిపెట్టాడు. దీంతో 28 ఏండ్ల తర్వాత కోపా అమెరికా టోర్నీని అర్జెంటీనా కైవసం చేసుకున్నది. అదేవిధంగా కెప్టెన్ లియోనల్ మెస్సీ సారథ్యంలో తొలిసారిగా అతిపెద్ద టోర్నీని గెలిచినట్లయింది.
అర్జెంటీనా చివరిసారిగా 1993లో కోపా అమెరికా కప్‌ను గెలుచుకున్నది. మొత్తంగా ఇప్పటివరకు ఆ జట్టు 15 సార్లు ఈ టైటిల్‌ను సొంతం చేసుకుంది. దీంతో కోపా అమెరికా టోర్నీలో అత్యధిక టైటిళ్లు గెలిచిన జట్టుగా ఉరుగ్వే సరసన నిలిచింది. ఆ జట్టు ఇప్పటివరకూ 15 సార్లు ఈ టోర్నీలో గెలుపొందింది.

కాగా, కోపా అమెరికా ఫైనల్లో బ్రెజిల్, అర్జెంటీనా తలపడడం ఇది మూడోసారి. 1937లో తొలిసారి ఈ టోర్నీ ఫైనల్లో ఈ రెండు జట్లు పోటీపడ్డాయి. అప్పుడు కూడా అర్జెంటీనా జట్టు విజేతగా నిలిచింది. ఆ తర్వాత రెండు సార్లు (2004, 2007) బ్రెజిల్ టైటిల్ సొంతం చేసుకున్నది. ఇప్పటి వరకూ అర్జెంటీనా, బ్రెజిల్ 112 మ్యాచ్‌ల్లో తలపడగా.. బ్రెజిల్ 46 మ్యాచ్‌లు, అర్జెంటీనా 41 మ్యాచ్‌ల చొప్పున గెలుపొందాయి.
ఇవి కూడా చదవండి..
‘వర్జిన్ గెలాక్టిక్’.. నేడు రోదసీలోకి తెలుగమ్మాయి
ప్రకాశవంతమైన సూపర్నోవా
పాఠశాలల్లో ఫీజుల మోత
ఇద్దరంటే ఇద్దరే!
కరోనా నెమ్మదించలేదు
శబ్ద కాలుష్య నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా.. ఎంతంటే?!
డీజీ సెట్ వాడితే లక్ష జరిమానా
68 రోజుల్లో 38సార్లు పెరిగిన ఇంధన ధరలు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్‌కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

