‘వర్జిన్ గెలాక్టిక్’.. నేడు రోదసీలోకి తెలుగమ్మాయి
వర్జిన్ గెలాక్టిక్| వినువీధిలో తెలుగు కీర్తి పతాకం రెపరెపలాడబోతున్నది. అంతరిక్ష పర్యాటకాన్ని ప్రోత్సహించడంలో భాగంగా ‘వర్జిన్ గెలాక్టిక్’ అంతరిక్ష పరిశోధన సంస్థ ‘వీఎస్ఎస్ యూనిటీ-22’ అనే మానవసహిత వ్యోమనౌకను రోదసీలోకి ఆదివారం పంపిస్తున్నది. ఇందులో ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన శిరీష బండ్ల ప్రయాణించనున్నారు.

హ్యూస్టన్: వినువీధిలో తెలుగు కీర్తి పతాకం రెపరెపలాడబోతున్నది. అంతరిక్ష పర్యాటకాన్ని ప్రోత్సహించడంలో భాగంగా ‘వర్జిన్ గెలాక్టిక్’ అంతరిక్ష పరిశోధన సంస్థ ‘వీఎస్ఎస్ యూనిటీ-22’ అనే మానవసహిత వ్యోమనౌకను రోదసీలోకి ఆదివారం పంపిస్తున్నది. ఇందులో ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన శిరీష బండ్ల ప్రయాణించనున్నారు. వాతావరణ పరిస్థితులన్నీ అనుకూలిస్తే న్యూ మెక్సికో నుంచి ఆదివారం ఉదయం 9 గంటలకు (అమెరికా కాలమానం) ‘వీఎస్ఎస్ యూనిటీ–22’ అంతరిక్షంలోకి దూసుకుపోనున్నది. వర్జిన్ గెలాక్టిక్ వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాస్నన్, శిరీషతోపాటు మరో నలుగురు హ్యోమగాములు ఈ స్పేస్ క్రాఫ్ట్‌లో వెళ్లనున్నారు. భూమి నుంచి 15 వేల మీటర్ల ఎత్తుకు వీఎంఎస్ ఈవ్ ప్రత్యేక విమానం వెళ్లనుంది. అందులోనే వ్యోమనౌక వీఎస్ఎస్ యూనిటీ-22 ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో జన్మించిన శిరీష.. తల్లిదండ్రులతో హ్యూస్టన్‌లో స్థిరపడ్డారు. అక్కడే విద్యనభ్యసించి ఏరోనాటికల్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. వర్జిన్ గెలాక్టిక్‌లో ఈ ఏడాది జనవరి నుంచి ప్రభుత్వ వ్యవహారాలు-పరిశోధన కార్యకలాపాల విభాగానికి ఆమె ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాగా, ఈ ప్రయాణంలో భాగస్వామ్యం కావడం తనకెంతో సంతోషంగా ఉందని శిరీష ట్విటర్లో పేర్కొన్నారు. అంతరిక్షయానాన్ని అందరికీ అందుబాటులోకి తేవడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. కల్పన చావ్లా, సునీత విలియమ్స్ తర్వాత రోదసిలోకి ప్రయాణించనున్న మూడో భారతీయ మహిళగా శిరీష నిలవనున్నారు.
ఇవి కూడా చదవండి..
ప్రకాశవంతమైన సూపర్నోవా
పాఠశాలల్లో ఫీజుల మోత
ఇద్దరంటే ఇద్దరే!
కరోనా నెమ్మదించలేదు
శబ్ద కాలుష్య నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా.. ఎంతంటే?!
డీజీ సెట్ వాడితే లక్ష జరిమానా
68 రోజుల్లో 38సార్లు పెరిగిన ఇంధన ధరలు
17 నుంచి తెరుచుకోనున్న శబరిమల ఆలయం
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

