శబ్ద కాలుష్య నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా.. ఎంతంటే?!
శబ్ద కాలుష్య నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా.. ఎంతంటే?! | శబ్ద కాలుష్య నిబంధనలను ఉల్లంఘిస్తే ఢిల్లీ వాసులు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అనుమతి...

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ నగర వాసులకు చేదు గుళిక.. శబ్ద కాలుష్య నిబంధనలను ఉల్లంఘిస్తే ఢిల్లీ వాసులు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అనుమతి లేకుండా లౌడ్ స్పీకర్లను వాడినా, డీజేలు పెట్టినా.. శబ్ద కాలుష్యం ఉల్లంఘిస్తే రూ.10 వేల నుంచి రూ. లక్ష వరకు ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఢిల్లు కాలుష్య నియంత్రణ కమిటీ (డీపీసీసీ) నిబంధనలను సవరించింది.
సవరించిన నిబంధనల ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో అనుమతి లేకుండా రాత్రి వేళ లౌడ్ స్పీకర్ వాడినా, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ వాడినా రూ.10 వేలు జరిమానా వసూలు చేస్తుంది డీపీసీసీ. అలాగే లౌడ్ స్పీకర్, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ కూడా జప్తు చేస్తారు.
1000 కేవీఏ సామర్థ్యం గల డీజిల్ జనరేటర్ సెట్ చేస్తే రూ. లక్ష, 62.5 నుంచి 1000 కేవీఏ సామర్థ్యం గల డీజేలను ఏర్పాటు చేస్తే రూ.25 వేలు జరిమాన చెల్లించాలి. 62.5 కేవీఏ సామర్థ్యం గల డీజేలను ఏర్పాటు చేస్తే రూ.10 వేలు చెల్లించాల్సి ఉంటుంది.
రెసిడెన్షియల్ ప్రాంతాల్లో పగలు శబ్ద స్థాయి 55 డెసిబుల్స్, రాత్రి వేళ 45 డెసిబిల్స్ వరకు మాత్రమే అనుమతిస్తారు. వాణిజ్య సముదాయాల్లో పగలు 65 డెసిబుల్స్, రాత్రి 55 డెసిబుల్స్, సున్నిత ప్రాంతాల్లో పగలు 50 డెసిబుల్స్, రాత్రి 40 డెసిబుల్స్‌కు అనుమతించారు.
పాఠశాలలు, కాలేజీలు, హాస్పిటల్స్, కోర్టుల పరిసరాల్లో 100 మీటర్ల వరకు నిశ్శబ్ద జోన్లుగా ప్రకటించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Delhi
- spund pollution
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్‌కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

