iQOO | 10,000mAh బ్యాటరీతో iQOO కొత్త ఫోన్.. 7 ఇంచుల భారీ డిస్ప్లే కూడా!
iQOO | స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో బ్యాటరీ సామర్థ్యంపై కంపెనీలు ప్రత్యేక దృష్టి పెడుతున్నాయి. ఇప్పటికే మార్కెట్లోకి భా బ్యాటరీలతో ఫోన్లు అందుబాటులోకి వస్తుండగా.. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఐక్యూ (iQOO) కూడా భారీ బ్యాటరీ ఫోన్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
iQOO | స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో బ్యాటరీ సామర్థ్యంపై కంపెనీలు ప్రత్యేక దృష్టి పెడుతున్నాయి. ఇప్పటికే మార్కెట్లోకి భా బ్యాటరీలతో ఫోన్లు అందుబాటులోకి వస్తుండగా.. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఐక్యూ (iQOO) కూడా భారీ బ్యాటరీ ఫోన్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ ఫోన్లో ఏకంగా 10,000mAh కంటే ఎక్కువ సామర్థ్యం కలిగిన బ్యాటరీతో పాటు 7 ఇంచుల భారీ డిస్ప్లే ఉండొచ్చని టెక్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఐక్యూ జెడ్12 (iQOO Z12) సిరీస్‌లో భాగంగా ఈ ఫోన్ వచ్చే అవకాశం ఉందని టిప్‌స్టర్ వెల్లడించింది
ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ (Digital Chat Station) చైనీస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వీబో (Weibo)లో ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ ఫోన్ ప్రస్తుతం మోల్డ్ స్టేజ్‌కు చేరుకున్నట్లు పేర్కొన్నారు. అంటే ఫోన్ బాహ్య డిజైన్, పరిమాణం, ఆకృతికి సంబంధించిన పనులు దాదాపు పూర్తయినట్లు అర్థం. అయితే లాంచ్‌కు ముందు ఇతర హార్డ్‌వేర్ వివరాల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది.
లీకైన సమాచారం ప్రకారం.. ఈ ఫోన్లో 7 ఇంచుల భారీ స్క్రీన్ ఉండనుంది. అలాగే 10,000mAh కంటే ఎక్కువ సామర్థ్యం కలిగిన బ్యాటరీని అందించనున్నట్లు తెలుస్తోంది. అయితే డిస్ప్లే టెక్నాలజీ, ప్రాసెసర్, కెమెరా, ఛార్జింగ్ వేగం వంటి వివరాలు ఇంకా వెల్లడికాలేదు. ఈ ఫోన్ 2027 మధ్య నాటికి చైనా మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని అంచనా.
iQOO Z12S పేరుతో వచ్చే అవకాశం?
ఈ ఫోన్‌కు సంబంధించి అధికారిక పేరు ఇంకా ఖరారు కాలేదు. అయితే ఐక్యూ జెడ్12ఎస్ (iQOO Z12S) పేరుతో మార్కెట్లోకి రావచ్చని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం ఇది కేవలం ఊహాగానమే. కంపెనీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఇప్పటికే ఐక్యూ జెడ్11 సిరీస్‌లో భాగంగా వచ్చిన iQOO Z11 స్మార్ట్‌ఫోన్‌లో 9,020mAh బ్యాటరీ ఉండగా.. iQOO Z11Sలో 10,000mAh బ్యాటరీని అందించారు. మరోవైపు iQOO Z11 Turboలో ఫ్లాగ్షిప్ స్థాయి చిప్‌సెట్‌కు ప్రాధాన్యమిచ్చారు. ఈ నేపథ్యంలో రాబోయే Z12 సిరీస్‌లోనూ వేర్వేరు ధరల విభాగాలకు అనుగుణంగా ఫోన్లను తీసుకొచ్చే అవకాశం ఉంది.
గ్లోబల్ మార్కెట్ల కోసం మరో మూడు ఫోన్లు?
ఐక్యూ జెడ్12 సిరీస్‌లో భాగంగా చైనా మార్కెట్ కోసం iQOO Z12 Turboను తీసుకురావడానికి కంపెనీ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అలాగే గ్లోబల్ మార్కెట్ల కోసం iQOO Z12x, iQOO Z12 Lite మోడళ్లను కూడా అభివృద్ధి చేస్తున్నట్లు టెక్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే 7 ఇంచుల డిస్ప్లే, 10,000mAhకు పైగా బ్యాటరీతో రానున్న కొత్త ఫోన్ ఏ పేరుతో విడుదలవుతుందనే దానిపై ఇంకా స్పష్టత లేదు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
iQOO | 10,000mAh బ్యాటరీతో iQOO కొత్త ఫోన్.. 7 ఇంచుల భారీ డిస్ప్లే కూడా!
Rajeev Kanakala | ఎన్టీఆర్ అప్పుడే స్టార్ అవుతాడని చెప్పా, 25 ఏళ్లు గడిచినా మారలేదు.. రాజీవ్ కనకాల ఆసక్తికర వ్యాఖ్యలు!
Dakshinamukhi Anjaneya Swamy | పార్డి (కె) గ్రామంలో ముగిసిన అఖండ హరినామ తాళ సప్తహ వేడుకలు
Mokshagna | మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై క్రేజీ అప్డేట్.. దర్శకత్వ బాధ్యతలు వశిష్ఠకే, జనవరి చివరి నుంచి షూటింగ్..
Firecrackers History | దీపావళికి బాణసంచా ఎలా వచ్చింది? చైనా నుంచి భారత్‌కు టపాసుల ప్రయాణం ఇదే!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

