డీజీ సెట్ వాడితే లక్ష జరిమానా
- లౌడ్ స్పీకర్ పెడితే రూ.10 వేలు

న్యూఢిల్లీ, జూలై 10: ఢిల్లీలో శబ్ద కాలుష్య నిబంధనలను ఉల్లంఘిస్తే ఇక భారీ జరిమానాలు తప్పవు. అనుమతి లేకుండా లౌడ్ స్పీకర్లు, డీజిల్ జనరేటర్ (డీజీ) సెట్లు ఉపయోగిస్తే రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకు ఫైన్ విధించనున్నారు. ఈ కొత్త నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ (డీపీసీసీ) అధికారులను ఆదేశించింది. బహిరంగ ప్రదేశంలో అనుమతి లేకుండా లౌడ్ స్పీకర్ ఉపయోగించరాదు. రాత్రిపూట అసలు వాడరాదు. దీనిని ఉల్లంఘిస్తే రూ.10 వేలు జరిమానా విధిస్తారు. 1000 కేవీఏకి మించిన డీజీ సెట్లను వినియోగిస్తే రూ.లక్ష ఫైన్ వసూలు చేస్తారు. నివాస ప్రాంతాల్లో పగటిపూట శబ్ద స్థాయి 55 డెసిబిల్, రాత్రివేళ 45 డెసిబిల్కి మించకూడదు. పాఠశాలలు, కళాశాలలు, దవాఖానలు, కోర్టులకు 100 మీటర్ల పరిధిలోని ప్రాంతాన్ని ‘సైలెంట్ జోన్లు’గా ప్రకటించారు. వివాహ వేడుక సమయంలో బాణసంచా కాల్చరాదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- DJ set
- Loudspeaker
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

