e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, September 22, 2021
Home జాతీయం పాఠశాలల్లో ఫీజుల మోత

పాఠశాలల్లో ఫీజుల మోత

63% మంది తల్లిదండ్రులది ఇదే మాట
దేశవ్యాప్తంగా లోకల్‌ సర్కిల్స్‌ సర్వేలో వెల్లడి

హైదరాబాద్‌, జూలై 10 (నమస్తే తెలంగాణ): కొవిడ్‌ వల్ల ఏడాదిన్నర నుంచి స్కూళ్లు మూతపడ్డాయి. ఇప్పుడిప్పుడే ఆన్‌లైన్‌ తరగతులు జరుగుతున్నాయి. త్వరలో థర్డ్‌ వేవ్‌ తప్పదని నిపుణులు హెచ్చరిస్తుండటంతో ఆన్‌లైన్‌ క్లాసులైనా ఏడాది పొడవునా జరుగాతాయా? లేదా? అన్న అయోమయం చాలామందిలో నెలకొంది. మరోవైపు కొన్ని ప్రైవేటు స్కూళ్లు ఫీజులను విపరీతంగా పెంచేశాయి. దీన్ని నిరసిస్తూ హైదరాబాద్‌, బెంగళూరు, పుణె లాంటి నగరాల్లో పేరెంట్స్‌ అసోసియేషన్లు ధర్నాలు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా స్కూళ్లలో ఫీజులు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు లోకల్‌ సర్కిల్స్‌ సంస్థ సర్వే నిర్వహించింది. గతేడాదితో పోలిస్తే ఫీజులు పెరిగాయని 63 శాతం మంది చెప్పారు. సర్వేలో వెల్లడైన అభిప్రాయాలు ఇవీ..

గతేడాదితో పోలిస్తే ఫీజులు పెరిగాయా?
అభిప్రాయం శాతం
పెరగలేదు 22
20% మించి పెరిగాయి 33
10-20% వరకు పెరిగాయి 23
10% పెరిగాయి 7
ఈసారి ఫీజులు తగ్గాయి 2
10-20% వరకు తగ్గాయి 1
చెప్పలేం 12

- Advertisement -

ఫీజుల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలు ఎలా ఉన్నాయి?
అభిప్రాయం శాతం
చాలా ప్రభావవంతంగా ఉన్నాయి 6
కొంత వరకు ప్రభావం చూపుతున్నాయి 23
ప్రభావవంతంగా లేవు 41
ఇప్పటివరకు ఎలాంటి చర్యలు లేవు 24
చెప్పలేం 6

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana