Dakshinamukhi Anjaneya Swamy | పార్డి (కె) గ్రామంలో ముగిసిన అఖండ హరినామ తాళ సప్తహ వేడుకలు
Dakshinamukhi anjaneya swamy | భజన దిండి, భజన బృందాల కీర్తనలు, తాళ మృదంగాల నడుమ పార్డి (కె) గ్రామంలో నిర్వహించిన శోభాయాత్ర భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ఉట్టి కొట్టే కార్యక్రమం భక్తుల్లో ఉత్సాహాన్ని నింపింది.
Dakshinamukhi anjaneya swamy | కుభీర్, నవంబర్ 08 : కుభీర్ మండలం పార్డి (కె) గ్రామంలోని శ్రీ దక్షిణముఖి ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో ఈ నెల 1వ తేదీన ప్రారంభమైన అఖండ హరినామ తాళ సప్తహ వేడుకలు ఆదివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా ముగిశాయి. ముగింపు వేడుకల్లో భాగంగా తెల్లవారుజామున కాకడ హారతి నిర్వహించారు. అనంతరం భజన దిండి, భజన బృందాల కీర్తనలు, తాళ మృదంగాల నడుమ గ్రామంలో నిర్వహించిన శోభాయాత్ర భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ఉట్టి కొట్టే కార్యక్రమం భక్తుల్లో ఉత్సాహాన్ని నింపింది.
అనంతరం ఆలయ ప్రాంగణంలో కాలా కీర్తన, పూర్ణాహుతి కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించి సప్తహ వేడుకలకు పూర్ణవిరామం పలికారు. శనివారం రాత్రి, ఆదివారం ఆలయ ప్రాంగణంలో శ్రీ పరమేశ్వర్ మహారాజ్ భక్తులకు ఆధ్యాత్మిక ప్రవచనాలు అందించారు. భగవంతుని నామస్మరణతో మనసుకు ప్రశాంతత లభిస్తుందని, ప్రతి ఒక్కరూ భక్తి, ధర్మం, సేవాభావం, సత్ప్రవర్తనను అలవర్చుకోవాలని ఆయన ఉద్బోధించారు.
ఏడు రోజుల పాటు సాగిన ఈ అఖండ హరినామ సంకీర్తనలతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. చివరిగా అన్నదాన భండారా కార్యక్రమం నిర్వహించగా.. గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. గ్రామ ప్రజల సహకారం, భక్తుల భాగస్వామ్యంతో సప్తహ వేడుకలు విజయవంతంగా ముగిశాయి. ఈ వేడుకల్లో ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ మండల నాయకులు, ఆయా గ్రామాల సర్పంచులు, స్థానిక సర్పంచ్ బందెల గంగామణి సత్యనారాయణ, ఆలయ కమిటీ అధ్యక్షులు దుంపెటి రాములు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు, అన్న ప్రసాదం స్వీకరించారు.
Read Today's Latest Adilabad Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dakshinamukhi Anjaneya Swamy | పార్డి (కె) గ్రామంలో ముగిసిన అఖండ హరినామ తాళ సప్తహ వేడుకలు
Mokshagna | మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై క్రేజీ అప్డేట్.. దర్శకత్వ బాధ్యతలు వశిష్ఠకే, జనవరి చివరి నుంచి షూటింగ్..
Firecrackers History | దీపావళికి బాణసంచా ఎలా వచ్చింది? చైనా నుంచి భారత్కు టపాసుల ప్రయాణం ఇదే!
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

