IND vs ZIM : తొలి టీ20లో ఓటమి నుంచి తేరుకున్న భారత కుర్రాళ్లు రెండో మ్యాచ్‌లో వీరవిహారం చేశారు. సిరీస్ సమం చేయాలంటే గెలవక తప్పని మ్యాచ్‌లో జింబాబ్వే బౌలర్లను ఓపెనర్ అభిషేక్ శర్మ(100) ఊచకోత కోశాడు. మెరుపు బ్యాటింగ్‌తో సెంచరీ బాదేసి భారీ స్కోర్‌కు బాటలు వేశాడు. ఆ తర్వాత రుతురాజ్ గైక్వాడ్ (77 నాటౌట్), రింకూ సింగ్(48 నాటౌట్)లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. అభిషేక్ ఔటయ్యాక వీళ్లిద్దరూ బౌండరీలతో విరుచుకుపడడంతో, టీమిండియా స్కోర్ రాకెట్ వేగంతో పరుగులు తీసింది. ఈ ముగ్గురి వీరబాదుడుతో భారత్ ప్రత్యర్థికి 235 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న శుభ్‌మన్ గిల్ నమ్మకాన్ని కుర్రాళ్లు నిలబెట్టారు. తొలి మ్యాచ్‌లో సున్నాకే ఔటైన అభిషేక్ శర్మ(100) సిక్సర్‌తో ఖాతా తెరిచి.. తన ఉద్దేశాన్ని చాటాడు. అయితే.. గిల్(2) స్వల్ప స్కోర్‌కే వెనుదిరిగినా.. అభిషేక్ మాత్రం జోరు తగ్గించలేదు. రుతురాజ్ గైక్వాడ్(77) జతగా ప్రత్యర్థి బౌలర్లను ఉతికేశాడు.
📸 📸 That 💯 Feeling! ✨
Congratulations Abhishek Sharma! 👏 👏
Follow the Match ▶️ https://t.co/yO8XjNpOro#TeamIndia | #ZIMvIND | @IamAbhiSharma4 pic.twitter.com/EWQ8BcDAL3
— BCCI (@BCCI) July 7, 2024
మసకజ్ద వేసిన14వ హ్యాట్రిక్ సిక్సర్లు బాదిన అభిషేక్ టీ20ల్లో తొలి సెంచరీ సాధించాడు. కేవలం 47 బంతుల్లోనే అతడు వంద కొట్టగా.. ఆ తర్వాత తమ వంతు అన్నట్టు గైక్వాడ్, రింకూ సింగ్(48 నాటౌట్)లు విధ్వంసం సృష్టించారు. బౌండరీల మోతతో జింబాబ్వే బౌలర్లను హడలెత్తించి జట్టు స్కోర్ 200 దాటించారు. వీళ్లు మూడో వికెట్‌కు 87 పరుగులు జోడించడంతో టీమిండియా నిర్ణీత ఓవర్లలో 234 రన్స్ చేసింది.
భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ(100) రెండో అంతర్జాతీయ మ్యాచ్‌లోనే శతక గర్జన చేశాడు. ఆదివారం హారారే స్పోర్ట్స్ క్లబ్లో జింబాబ్వే బౌలర్లను ఊచకోత కోసిన అభిషేక్ మెరుపు బ్యాటింగ్‌తో వంద కొట్టేశాడు.రెండో ఇన్నింగ్స్‌ల్లోనే వంద కొట్టి.. దీపక్ హుడాను వెనక్కి నెట్టేశాడు. అంతేకాదు చిన్నవయసులోనే టీ20ల్లో సెంచరీ బాదిన నాలుగో క్రికెటర్‌గా అభిషేక్ చరిత్ర సృష్టించాడు. అతడి కంటే ముందు యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్, సురేశ్ రైనాలు ఉన్నారు.
Innings Break!
A solid batting display from #TeamIndia! 💪 💪
A maiden TON for @IamAbhiSharma4
An unbeaten 77 for @Ruutu1331
A cracking 48* from @rinkusingh235Over to our bowlers now! 👍 👍
Scorecard ▶️ https://t.co/yO8XjNqmgW#ZIMvIND pic.twitter.com/FW227Pv4O3
— BCCI (@BCCI) July 7, 2024