Bangaru Bomma | తెలుగులో ఆల్బమ్స్ కొత్తేమీ కాదని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తాజాగా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందించిన ఇండిపెండెంట్ ఆల్బమ్ బంగారు బొమ్మ (మ్యూజిక్ వీడియో). ఎంసీ హరి, ప్రొజాక్ స్వీయ రచనలో పాడిన ఈ పాటను ఆస్కార్ అవార్డ్ విన్నర్ చంద్రబోస్ లాంఛ్ చేసిన విషయం తెలిసిందే.
బంగారు బొమ్మ (Bangaru Bomma) రావేమే పందిట్లో పెళ్లి జరిగేనే.. అంటూ సాగే ఎవర్ గ్రీన్ ఓల్డ్ సాంగ్‌కు ర్యాప్ స్టైల్‌తో నయా టచ్ ఇస్తూ మొదలైన ఈ పాట నీ చూపులో మది మురిసె.. ఎద ఎడారిలో నీరై మెరిసే.. నీ కౌగిలికై తలచే అంటూ డిఫరెంట్ మ్యానిరిజం యాక్షన్ పార్టుతో సాగుతున్న ఈ పాట నెటిజన్లను ఇంప్రెస్ చేస్తోంది. చాలా రోజుల తర్వాత వచ్చిన ఇండిపెండెంట్ ఆల్బమ్‌ను మ్యూజిక్ లవర్స్ ఎంజాయ్ చేస్తున్నారు.
ఇప్పటికే న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్ భవనంపై బంగారు బొమ్మ సందడి చేస్తుందని తెలిసిందే. బిల్డింగ్‌పై బంగారు బొమ్మ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఆల్బమ్‌ను క్రిస్టోలైట్ మీడియా క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రణీత్ నెకూరి తెరకెక్కించారు.
Devara | డబ్బింగ్ పనుల్లో తారక్ దేవర.. హిమజ క్లారిటీ
Saripodhaa Sanivaaram | నాని ‘సరిపోదా శనివారం’ నుంచి ప్రియాంక మోహన్ ఫస్ట్ లుక్ రిలీజ్
Raj Tharun – Lavanya | రాజ్ తరుణ్ లేకుండా నేను బతకలేను : లావణ్య