Raj Tharun – Lavanya | రాజ్ తరుణ్ లేకుండా నేను బతకలేను : లావణ్య
Raj Tarun | టాలీవుడ్లో ప్రస్తుతం రాజ్ తరుణ్ వర్సెస్ లావణ్య వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి హీరోయిన్ మాల్వీ మల్హోత్ర మోజులో పడి తనను వదిలేసి వెళ్లిపోయాడని లావణ్య నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
Raj Tarun | టాలీవుడ్లో ప్రస్తుతం రాజ్ తరుణ్ వర్సెస్ లావణ్య వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి హీరోయిన్ మాల్వీ మల్హోత్ర మోజులో పడి తనను వదిలేసి వెళ్లిపోయాడని లావణ్య నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో రాజ్ తరుణ్ వర్సెస్ లావణ్య, లావణ్య వర్సెస్ మాల్వీ మల్హోత్ర మధ్య ఎన్నో ట్విస్టులు వెలుగుచూస్తున్నాయి. ఇప్పటికే ఈ విషయంపై రాజ్ తరుణ్ వచ్చి మీడియా వేదికగా తన తప్పేమి లేదంటూ ప్రకటించాడు. లావణ్య, మస్తాన్ సాయి ఇలా కలిసి చేస్తున్నారు. మస్తాన్ సాయికి లావణ్యకు రిలేషన్ ఉంది. డబ్బుల కోసమే వారు ఇలా చేస్తున్నారు అంటూ రాజ్ తరుణ్ వెల్లడించాడు అయితే ఈ వ్యాఖ్యలపై లావణ్య నేడు మీడియా ముందుకు వచ్చి సంచలన వ్యాఖ్యలు చేసింది.
మస్తాన్ సాయికి నాకు ఎలాంటి సంబంధం లేదు. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ మాత్రమే. రాజ్ తరుణ్ కావాలని మాపై ఆరోపణలు చేస్తున్నాడు. నన్ను వదిలించుకోవాలని ఎప్పటినుంచో ప్లాన్ చేస్తున్నాడు. అందుకు డ్రగ్స్, మస్తాన్ సాయి అంటూ కథలు చెబుతున్నాడు. నాకు రాజ్ తరుణ్‌కు పెళ్లి అయ్యింది. మేము పెళ్లి చేసుకున్న ఫొటోలు నా ఫోన్లో ఉండేవి వాటిని రాజ్ తరుణ్ డిలిట్ చేశాడు. రాజ్ తరుణ్ లైఫ్‌లోకి నేను హీరో అయ్యాకా రాలేదు.
అతడు ఉయ్యాలా జంపాలా సినిమా తీసే టైంలోనే పక్క పక్క ఇళ్లల్లో ఉండేవాళ్లం. మా పెళ్లి విషయం సమయం వచ్చినప్పుడు నేనే బహిరంగంగా ప్రకటిస్తానని తెలిపాడు అందుకే అతడిని నమ్మాను. రాజ్ తరుణ్ లేకుండా నేను బతకలేను. నేను ముసలిదాన్ని అయిన కూడా అతనే నా మనసులో ఉంటాడు.
రాజ్ తరుణ్ మాల్వీ మల్హోత్ర మోజులో పడింది నిజం. కావలంటే వారి ఫొటోలు చూడండి. బ్యాంకు లావాదేవీలు చెక్ చేయండి.. కాల్ లిస్ట్ చూడండి. హోటల్లో ఉన్న లిస్ట్ ఇస్తాను. అప్పుడు కానీ నిజం బయటపడదు. నాకు సహయం చేసేవారు ఎవరు లేకా పోలీస్ స్టేషన్‌కు వేళితే నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావని రాజ్ తరుణ్ అంటున్నాడు. మాల్వీ మల్హోత్ర ఫాదర్ హిమచల్ ప్రదేశ్ సీఏం ఫ్రెండ్. నువ్వు కేసు పెడితే వాళ్లు కేసు పెట్టారు. నువ్వు గొడవ చేస్తే వాళ్లు చేయరు అనుకుంటున్నావా.. వాళ్లు తలచుకుంటూ నెక్స్ట్ సెకండ్లో నువ్వు జైలుకి వెళతావు బయటికి కూడా రావు అంటూ లావణ్య చెప్పుకోచ్చింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Child Marriage | టెంకంపేట్లో బాల్యవివాహానికి బ్రేక్.. అధికారుల చొరవతో నిలిపివేత
Begumpet Students | సిద్దిపేట వైజ్ఞానిక ప్రదర్శనలో బేగంపేట విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి స్మార్ట్ వాకర్ ప్రాజెక్టు
Myanmar military bombs school | స్కూల్‌పై మయన్మార్ ఆర్మీ బాంబు దాడి.. మహిళలు, పిల్లలతో సహా 30 మంది మృతి
ఓబీసీ కులగణన తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలి.. బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలి.. జాజుల శ్రీనివాస్ డిమాండ్
IAS Transfers | రాష్ట్రంలో మరోసారి ఐఏఎస్‌ల బదిలీలు.. కీలక శాఖల్లో కొత్త నియామకాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

