Devara | జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) టైటిల్లో రోల్లో నటిస్తోన్న చిత్రం దేవర (Devara). కొరటాల శివ (Siva Koratala) దర్శకత్వం వహిస్తున్నాడు. దేవర రెండు పార్టులుగా విడుదల కానుండగా.. పార్టు 1 సెప్టెంబర్27 న గ్రాండ్‌గా విడుదల కానుంది. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా గురించి ఏదో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతూ అభిమానులు, మూవీ లవర్స్‌లో జోష్ నింపుతోంది. దేవర డబ్బింగ్ కార్యక్రమాల్లో బిజీగా ఉందని ఇప్పటికే ఓ అప్డేట్ బయటకు వచ్చిందని తెలిసిందే.
తాజాగా వన్ ఆఫ్ ది సపోర్టింగ్ రోల్ పోషిస్తోన్న హిమజ ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేసింది. హిమజ డబ్బింగ్ సెషన్లో స్టిల్ ఒకటి ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకుంటున్నట్టు తెలియజేసింది హిమజ. మరోవైపు దేవర షూటింగ్ కూడా జెట్ స్పీడ్‌లో కొనసాగుతోంది. దేవర నుంచి అనిరుధ్ రవిచందర్ కంపోజ్‌లో ఇప్పటికే లాంఛ్ చేసిన ఫియర్ సాంగ్ (fear song) నెట్టింటిని షేక్ చేస్తూ.. మిలియన్లకుపైగా వ్యూస్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
మరోవైపు గ్లింప్స్ కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మూవీలో బాలీవుడ్ భామ జాన్వీకపూర్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. జాన్వీకి దేవర తెలుగు డెబ్యూ ప్రాజెక్ట్. ఈ చిత్రంలో బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ భైర పాత్రలో నటిస్తుండగా.. ప్రకాశ్ రాజ్, షైన్ టామ్ ఛాకో, శ్రీకాంత్, మురళీ శర్మ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, కొనరాజు హరికృష్ణ, కల్యాణ్ రామ్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.